Karnataka : యడియూరప్ప సన్నిహితుల నివాసాల్లో ఐటీ సోదాలు

 కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సన్నిహితుల నివాసాల్లో గురవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Karnataka : యడియూరప్ప సన్నిహితుల నివాసాల్లో ఐటీ సోదాలు

Karnataka (3)

Karnataka  కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సన్నిహితుల నివాసాల్లో గురవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేతకు సంబంధి వ్యాపారవేత్తలు,కాంట్రాక్టర్లు,చార్టెడ్ అకౌంటెంట్ల నివాసాలు,కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. బెంగళూరు,బాగల్ కోటె,బెల్గావి,విజయాపుర,దావణగెరెలోని మొత్తం 50 ఫ్లేస్ లలో జరిగిన ఐటీ సోదాల్లో మొత్తం 300 మంది అధికారులు పాల్గొన్నారు.

యడియూరప్ప వ్యక్తిగత సహాయకుడు ఉమేష్ నివాసంలో కూడా ఐటీ సోదాలు జరిగాయి. యడియూరప్ప సీఎంగా ఉన్న సమయంలో సీఎంవోలో వ్యక్తిగత సహాయకుడిగా ఉమేష్ ఉన్నారు. అంతేకాకుండా,యడియూరప్ప కుమారుడు బీఎస్ విజయేంద్రకి కూడా ఉమేష్ సన్నిహితుడు.

ఈ ఐటీ సోదాల యొక్క ముఖ్యమైన టార్గెట్..ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోని కాంట్రాక్టర్లని సమాచారం. పన్నుల ఎగవేత మరియు ఇతర అక్రమ మార్గాల ద్వారా పలువురు సంపదను కూడబెట్టుకోవడం గురించి కర్ణాటక నీటిపారుదల శాఖలోని ఒక అంతర్గత వ్యక్తి నుండి అందిన సమాచారం నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. యడ్యూరప్ప హయాంలో చేపట్టిన సాగునీటి పథకాలలో భారీ వ్యత్యాసాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.

కాగా,సోదాల సమయంలో అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బెంగుళూరులోని ఉమేశ్ నివాసంలో నాలుగు బ్యాగ్‌లతో నిండిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఉమేష్ బంధువులకు చెందిన ఆరు ప్రదేశాలపై కూడా సోదాలు జరిగాయి.

ALSO READ మళ్లీ కరోనా కల్లోలం‌.. ఒక్కరోజే 924 మంది మరణం