Ballari Mayor Triveni : 18 ఏళ్లకే రాజకీయాల్లోకి, బళ్లారి మేయర్‌గా 23 ఏళ్ల యువతి ..

18 ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగు పెట్టి..21 ఏళ్లకే కార్పొరేటర్ గా పోటీ చేసి..విజయం సాధించి మరో రెండేళ్లకే నగర మేయర్ గా బాధ్యతలు చేపట్టిన ఓ యువతి కర్ణాటకలోని బళ్లారి రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఆమె పేరు త్రివేణి సూరి.

Ballari Mayor Triveni : 18 ఏళ్లకే రాజకీయాల్లోకి, బళ్లారి మేయర్‌గా 23 ఏళ్ల యువతి ..

23 Years Old Ballri moyor Triveni

Ballari mayor Triveni : 18 ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగు పెట్టి.. 21 ఏళ్లకే కార్పొరేటర్ గా పోటీ చేసి..విజయం సాధించి మరో రెండేళ్లకే నగర మేయర్ గా బాధ్యతలు చేపట్టిన ఓ యువతి కర్ణాటకలోని బళ్లారి రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఆమె పేరు త్రివేణి సూరి. 23 ఏళ్లకే మేయర్ గా బాధ్యతలు చేపట్టిన యువతిగా త్రివేణి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. బళ్లారి నగర పాలికె మేయర్‌గా త్రివేణి బుధవారం (మార్చి,29,2023) బాధ్యతలు చేపట్టారు. దీంతో కర్ణాటకలో అతి చిన్న వయస్సులోనే మేయర్ అయిన యువతిగా త్రివేణి కొత్త చరిత్ర సృషించారు. మేయర్ గా 23 ఏళ్ల త్రివేణి బాధ్యతలు చేపట్టగా డిప్యూటీ మేయర్ గా జానకి బాధ్యతలు చేపట్టారు. 18ఏళ్లకే కాంగ్రెస్ తరుపున రాజకీయాల్లోకి అడుగుపెట్టిన త్రివేణి సూరి ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు.

ఓటర్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి మొత్తం సభా బలం 44. మొత్తం 39 మంది ఓటర్లు ఉన్న సభలో ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఓట్లు సాధించి 28 ఓట్లు సాధించి త్రివేణి బీజేపీ అభ్యర్థి నాగరత్నమ్మ పై విజయం సాధించి బుధవారం జరిగిన మేయర్ ఎన్నికల్లో విజయం సాధించి అతి పిన్న వయసులోనే బళ్లారికి మేయర్ అయిన ఘనత సాధించారు. బీజేపీకి 13 మంది కార్పొరేట్లు ఉండటంతో మేయర్ పదవి దక్కించుకోవటానికి పలు యత్నాలు చేసింది. కానీ ఇండిపెండెంట్లు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న త్రివేణికే ఓట్లు వేయటంతో ఆమె మేయర్ గా ఎన్నికయ్యారు. మేయర్ పదవి దక్కించుకోవటానికి త్రివేణితో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు ఉమాదేవి, కుబేరప్ప కూడా విశ్వప్రయత్నాలు చేశారు. అయినా 23 ఏళ్ల త్రివేణి మేయర్ గా గెలుపొంది సంచలనం సృష్టించారు.

ఫార్మసీలో డిప్లొమా పూర్తిచేశారు త్రివేణి. ఆమె తల్లి సుశీలాబాయి 2019-20 మధ్య బళ్లారి మేయర్‌గా పనిచేశారు. మేయర్ పదవి దక్కించుకోవటానికి బీజేపీ పలు యత్నాలు చేసినా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న త్రివేణినే విజయం వరించి మేయర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ.. నేను 21 సంవత్సరాలకే కార్పొరేటర్‌గా విజయం సాధించటం వెనుక తనకు సహాయం చేసి..ఇప్పుడు 23 ఏళ్ల వయసులో మేయర్ అవ్వటానికి సహాయ సహకారాలు అందించిన ప్రతీ ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు అని తెలిపారు. అందరినీ కలుపుకుంటూ నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.33వ వార్డునుంచి గెలుపొంది డిప్యూటీ మేయర్‌గా బి.జానకి ఎన్నికయ్యారు.