Basavaraj Bommai : బసవరాజు బొమ్మై డబ్బులిచ్చి సీఎం అయ్యారు : మాజీ సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు

‘బసవరాజు బొమ్మై ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి కాదని డబ్బులిచ్చి సీఎం అయ్యారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కర్ణాటక సీఎంపై మాజీ సీఎం..కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య.

Basavaraj Bommai : బసవరాజు బొమ్మై డబ్బులిచ్చి సీఎం అయ్యారు : మాజీ సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు

Karnataka

Basavaraj Bommai : కర్ణాటక సీఎంపై మాజీ సీఎం..కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. దీంట్లో భాగంగా ‘బసవరాజు బొమ్మై ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి కాదని డబ్బులిచ్చి సీఎం అయ్యారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రూ.2500కోట్లు ఇస్తే తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నారంటూ కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారియి. నగదు మార్పిడితోనే బొమ్మై సీఎం పదవికి నియమితులయ్యారు అంటూ ఆరోపించారు. అలా డబ్బులిచ్చి సీఎం అయిన ఆయన పనులు ఎందుకు చేస్తారు..? అంటూ ఎద్దేవా చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆయనను ముఖ్యమంత్రి..వారి చెప్పింది చేయటమే బొమ్మై పని ఇక ప్రజల కోసం ఏం చేస్తారు?అంటూ ఎద్దేవా చేశారు.

గత నాలుగేళ్లలో పేద ప్రజలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని.. అటువంటి ప్రభుత్వం..అటువంటి సీఎం ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 15లక్షల ఇళ్లు నిర్మించామని.. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమి చేయనందుకు సిగ్గుపడాలని అన్నారు.

కాగా.. రూ. 2500 కోట్లు ఇస్తే ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని చెబుతూ కొందరు తనని సంప్రదించారని భాజపా ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నల్‌ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. కానీ డబ్బులిస్తే సీఎం అవుతారు అని ఆయనను ఎవరు సంప్రదించారనే విషయాన్ని బసనగౌడ పాటిల్ చెప్పలేదు. అటువంటి మోసపూరిత కంపెనీలు ఉన్నాయని ఆ పార్టీ కార్యకర్తలకు చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ భాజపాపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ వ్యవహారంలో పూర్తి దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది.