Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య

తాజాగా..బ్రిటన్‌ ఎంపీ జెరెమీ కార్బిన్‌ ను కలిసిన రాహుల్ గాంధీ ఆయనతో కలిసి ఫోటో దిగారు. కార్బిన్‌ తో రాహుల్ గాంధీ భేటీ అవడంపై కర్ణాటక బీజేపీ నేతలు స్పందించారు

Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య

Rahul

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన లండన్ పర్యటనలో పలు వివాదాలకు తావిస్తున్నారు. విదేశీ వేదికల సాక్షిగా భారత్ లో అధికార బీజేపీపై విషం వెళ్లగక్కిన రాహుల్ గాంధీ..ఆ దేశాల్లో దేశ పరువు తీస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న “ఐడియాస్ ఫర్ ఇండియా” కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ సహా భారత్ కు చెందిన రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు లండన్ చేరుకున్నారు. ఈక్రమంలో గత నాలుగు రోజులుగా లండన్ లో పలు సభల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ..భారత్ లో అధికార పక్షం బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా..బ్రిటన్‌ ఎంపీ జెరెమీ కార్బిన్‌ ను కలిసిన రాహుల్ గాంధీ ఆయనతో కలిసి ఫోటో దిగారు.

ఆ ఫొటోలో రాహుల్ అత్యంత సన్నిహితుడు శ్యాం పిట్రోడా కూడా ఉన్నారు. బ్రిటన్ ఎంపీ జెరెమీ కార్బిన్‌ గతంలో జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడారు. ఈనేపధ్యంలో జెరెమీ కార్బిన్‌ తో రాహుల్ గాంధీ భేటీ అవడంపై కర్ణాటక బీజేపీ నేతలు స్పందించారు. “UK MP మరియు లేబర్ నాయకుడు జెరెమీ కార్బిన్: భారత్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు, కాశ్మీర్‌పై పాకిస్తాన్ వైఖరికి మద్దతు ఇస్తున్నారు, హిందూ ద్వేషి మరియు తీవ్రవాద సానుభూతిపరుడు. కాంగ్రెస్ నాయకుడు మరియు వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అతనితో ఏమి చేస్తున్నారు?””అతను మరో టూల్‌కిట్‌తో భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడా?” అని బీజేపీ కర్ణాటక రాష్ట్ర విభాగం మంగళవారం ట్వీట్ చేసింది.

other stories:Amit Shah to Rahul Gandhi: ఇటలీ కళ్లద్దాలు తీసేయండి.. రాహుల్‌కు అమిత్ షా చురక

అయితే ఈ వ్యవహారంపై రాహుల్ స్నేహితుడు శ్యాం పిట్రోడా స్పందిస్తూ..”అతను (కార్బిన్) నాకు వ్యక్తిగత స్నేహితుడు మరియు హోటల్‌లో ఒక కప్పు టీ కోసం వచ్చాడు. ఇందులో రాజకీయంగా ఏమీ లేదు.” “జీవితంలో ప్రతిదీ రాజకీయా కోణంలో చోడొద్దు. మనతో ఏకీభవించని స్నేహితుల గురించి తెలుసుకోవడం మంచిదే. ఎటువంటి షరతులు లేకుండా గౌరవమర్యాదలతో ప్రవర్తించండి.” అంటూ బీజేపీ నేతల నుద్దేశించి ట్వీట్ చేశారు. ఇక కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా సైతం కర్ణాటక బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎంపీ జెరెమీ కార్బిన్‌, మోదీని కలిసిన ఫోటోలను ట్వీట్ చేస్తూ..ఇప్పుడేమంటారు అంటూ బీజేపీ నేతలను ప్రశ్నించారు.