Karnataka BJP Chief : రాహుల్ గాంధీ డ్రగ్స్ బానిస

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ డ్రగ్స్‌కు బానిస, డ్రగ్స్‌ వ్యాపారి అంటూ కర్ణాటక బీజేపీ చీఫ్ నలిన్‌ కుమార్‌ కతీల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హుబ్లీలో జరిగిన పార్టీ

Karnataka BJP Chief : రాహుల్ గాంధీ డ్రగ్స్ బానిస

Nalin

Karnataka BJP Chief  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ డ్రగ్స్‌కు బానిస, డ్రగ్స్‌ వ్యాపారి అంటూ కర్ణాటక బీజేపీ చీఫ్ నలిన్‌ కుమార్‌ కతీల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హుబ్లీలో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ నలిన్‌ కుమార్‌ కతీల్‌ బీజేపీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ…ఇది మీ(కాంగ్రెస్)కథ. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు బెయిల్ పై బయట ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కూడా బెయిల్ పై ఉన్నారు. వాస్తవానికి అతడు జైలులో ఉండాల్సింది కానీ బెయిల్ ఇవ్వాలని కోర్టులని అడుక్కున్నారు. ఆఖరికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా బెయిల్ పై ఉన్నారు.

మీకు ఏ నైతికత ఉంది? సోనియా గాంధీ తాను AICC అధ్యక్షురాలు అని చెప్పారు కానీ మీ నాయకులు రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా కోరుకుంటున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ ఎవరు? అతను డ్రగ్స్ వ్యాపారి మరియు డ్రగ్స్ బానిస. నేను ఇది చెప్పడం లేదు. ఒకసారి మీడియాలో కూడా వచ్చింది. అలాంటి వ్యక్తులు పార్టీని ఎలా నిర్వహిస్తారు అని నలిన్ కుమార్ ప్రశ్నించారు.

ప్ర‌ధాని మోదీ ఓ నిర‌క్ష్య‌రాస్యుడు అని క‌ర్ణాటక కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ వచ్చిన నేపథ్యంలోనే నళిన్‌కుమార్ ఇలా ఘాటుగా స్పందించారు. అక్టోబర్‌ 30న జరగనున్న సిందగి, హంగల్‌ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న క్రమంలో కర్ణాటక కాంగ్రెస్‌ ట్విటర్‌ హ్యాండిల్‌ నుంచి రెండు రోజుల క్రితం వెలువడిన ట్వీట్‌లో ప్రధాని మోదీకి చదువు రాదని కన్నడలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎన్నో పాఠశాలలు నిర్మించింది..మోదీ అక్కడ చదువుకోలేదు. వయోజనులకు కూడా విద్యా కార్యక్రమాలు పెట్టింది.. అక్కడా ఆయన చదువుకోలేదు. దేశాన్ని పాలిస్తున్నవారు ప్రజలను సోమరులను చేశారు. కనీసం బిచ్చమెత్తుకుందామంటే అది కూడా లేకుండా నిషేదించారు అని కాంగ్రెస్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే కర్నాటక కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్ లో ప్రధానిపై వచ్చిన ట్వీట్ ను తొలగిస్తున్నట్లు పీసీసీ ఛీఫ్ డీకే శివకుమార్ తెలిపారు.

నలిన్ కుమార్ వ్యాఖ్యలపై ఇవాళ ట్విట్టర్ లో స్పందించిన పీసీసీ ఛీఫ్ డీకే శివకుమార్.. బీజేపీ ఛీఫ్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. డీకే శివకుమార్ తన ట్వీట్ లో… రాజకీయాల్లో మా ప్రత్యర్థులకు కూడా గౌరవంగా ఉండాలని నేను నమ్ముతున్నాను. బీజేపీ నాతో ఏకీభవిస్తుందని ఆశిస్తున్నాను. రాహుల్ గాంధీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి దూషణ,అభ్యంతరకర వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నట్లు తెలిపారు. ఏ వర్గం వారైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా మసలుకోవాలని, ఇష్టారీతిన వ్యవహరించి అభాసుపాలు కావొద్దని సూచించారు.

ALSO READ  కశ్మీర్ లో పౌరుల హత్యలపై NIA దర్యాప్తు!