Karnataka: ముస్లిం రిజర్వేషన్లు తొలగించిన బీజేపీ ప్రభుత్వం

కర్ణాటక కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో వెనుకబడిన తరగతుల్లో కొత్తగా రూపొందించిన 2సీ, 2డీ కేటగిరీల కింద వొక్కలిగల కోటా 4 శాతం నుంచి 6 శాతానికి, వీరశైవ-లింగాయత్‌ల కోటా 5శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. అయితే ముస్లింలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటా కిందకు మార్చారు.

Karnataka: ముస్లిం రిజర్వేషన్లు తొలగించిన బీజేపీ ప్రభుత్వం

Karnataka BJP govt scraps 4% Muslim quota

Karnataka: కర్ణాటక రాష్ట్రంలో ముస్లిం సామాజిక వర్గానికి ఉన్న 4 శాతం రిజర్వేషన్‭ను బొమ్మై ప్రభుత్వం శుక్రవారం రద్దు చేసింది. రాష్ట్రంలో మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఒక మెజారిటీ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఓబీసీ కోటాలో 2బీ కింద ముస్లింలకు గతంలో కేటాయించిన 4% రిజర్వేషన్లను రద్దు స్థానిక బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని రెండు ఆధిపత్య వర్గాలైన వీరశైవ-లింగాయత్‌లు, వొక్కలిగలకు కేటాయించింది. ఉద్యోగాలు, విద్యా సంస్థలలో ప్రవేశాలలో వీరిద్దరికీ రెండుశాతం రిజర్వేషన్లు పెంచింది.

Maharashtra: మరో పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ.. ఈసారి సెగ శివసేన నుంచి

కర్ణాటక కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో వెనుకబడిన తరగతుల్లో కొత్తగా రూపొందించిన 2సీ, 2డీ కేటగిరీల కింద వొక్కలిగల కోటా 4 శాతం నుంచి 6 శాతానికి, వీరశైవ-లింగాయత్‌ల కోటా 5శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. అయితే ముస్లింలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటా కిందకు మార్చారు. ఈడబ్ల్యూఎస్ కింద అమలు చేస్తున్న 10% కోటాలో పోటీ పడాల్సి ఉంటుందని సీఎం బసవరాజు బొమ్మై తెలిపారు. కాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ముస్లిం వక్ఫ్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు క్రితం ఉన్న రిజర్వేషన్లను తిరిగి అమలు చేయాలంటూ శనివారం రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది.