Karnataka : సీఎం మార్పు..సస్పెన్స్, కర్ణాటక రాజకీయం

కర్ణాటక సీఎం మార్పుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. తాను పదవిలో ఉండాలా..? వద్దా? అనేదానిపై 2021, జూలై 26వ తేదీ సోమవారం క్లారిటీ వస్తుందంటున్నారు సీఎం యడుయూరప్ప. దీంతో.. కర్ణాటక రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. పదవి ఉన్నా లేకపోయినా చివరి శ్వాస వరకు బీజేపీ కోసం పనిచేస్తానని ఆయన చెప్పారు.

Karnataka : సీఎం మార్పు..సస్పెన్స్, కర్ణాటక రాజకీయం

Karnataka

Karnataka CM : కర్ణాటక సీఎం మార్పుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. తాను పదవిలో ఉండాలా..? వద్దా? అనేదానిపై 2021, జూలై 26వ తేదీ సోమవారం క్లారిటీ వస్తుందంటున్నారు సీఎం యడుయూరప్ప. దీంతో.. కర్ణాటక రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. పదవి ఉన్నా లేకపోయినా చివరి శ్వాస వరకు బీజేపీ కోసం పనిచేస్తానని ఆయన చెప్పారు. కర్ణాటక బీజేపీలో మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి మారనున్నారంటూ గత కొద్దికాలంగా వస్తున్న వార్తలపై స్పష్టత రానుంది.

Read More : Amazon Cryptocurrencies : అమెజాన్‌ యూజర్లు త్వరలో బిట్ కాయిన్‌‌‌ పేమెంట్స్ చేసుకోవచ్చు!

కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశం వెనుక కారణం కూడా ఇదేనంటూ వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి యడుయూరప్ప స్వయంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రెండు దశాబ్దాలుగా కన్నడనాట బీజేపీలో చక్రం తిప్పుతున్న యడుయూరప్పను మారుస్తారని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

Read More :Gold And Silver Rates : బంగారం ధరలు, ఏ నగరంలో ఎంత

ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసి వచ్చారు. ఆదివారం సాయంత్రానికల్లా యడుయూరప్ప భవితవ్యం తేలుతుందని పార్టీ నాయకులు భావించినా.. అది కాస్తా ఆలస్యమవుతోంది. సోమవారం జరిగే రెండో వార్షికోత్సవ సభలో ప్రభుత్వ విజయాల గురించి మాట్లాడుతానని.. దాని తర్వాత మిగతా విషయాలు మీకు తెలుస్తాయంటూ సీఎం ఓ క్లారిటీ ఇచ్చారు. పార్టీ కేంద్ర నాయకత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ గీసిన గీత దాటనని చెప్పారు. రాజీనామా చేయమని అధిష్ఠానం ఆదేశిస్తే రాజీనామా చేస్తానని.. సీఎంగా కొనసాగమంటే కొనసాగుతానన్నారు యడుయూరప్ప.