Karnataka: వేర్వేరుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్

సోనియా, రాహుల్ ను సిద్ధరామయ్య ఇవాళ ఉదయం కలిస్తే, శివకుమార్ సాయంత్రం కలిశారు.

Karnataka: వేర్వేరుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్

Siddaramaiah and DK Shivakumar

Congress: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ఇవాళ వేర్వేరుగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని కలిశారు. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో వారు చర్చించారు.

సోనియా, రాహుల్ ను సిద్ధరామయ్య ఇవాళ ఉదయం కలిస్తే, శివకుమార్ సాయంత్రం కలిశారు. కర్ణాటక కేబినెట్ విస్తరణతో పాటు పలు అంశాలపై వారు చర్చించారు. కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం తర్వాత జరిగిన తొలి భేటీ ఇది. ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వాన్ని నడుపుతానని సోనియాకు సిద్ధరామయ్య చెప్పినట్లు తెలుస్తోంది.

కేబినెట్ విస్తరణపై కర్ణాటకలోనూ మూడు రోజులుగా చర్చలు జరిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలు రణ్‌దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ తోనూ సిద్ధరామయ్య, శివకుమార్ చర్చించారు. మరోవైపు, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన 5 హామీలు గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య, యువ నిధి, శక్తి పథకాలను అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి చేస్తున్నాయి.

బీజేపీ, జేడీఎస్ నేతలు దీనిపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ హామీల అమలుకు ఏడాదికి దాదాపు రూ.50,000 కోట్లు ఖర్చు అవుతాయని ఇటీవలే సిద్ధరామయ్య స్వయంగా చెప్పారు. అన్నారు. వాటి అమలుకు ఏడాదికి రూ.65,000 కోట్లు ఖర్చు అవుతాయని కొందరు ప్రతిపక్ష నేతలు అంటున్నారు. అన్ని నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని నిలదీస్తున్నారు.

#9YearsOfModiGovernment: మోదీ పాలనలో ఏయే ఏడాది.. ఏయే కీలక ఘట్టం? పూర్తి వివరాలు