CM Yediyurappa : సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా?

కర్ణాటకలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీలో కేంద్ర పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు యడియూరప్ప. ఈ సందర్బంగా అనేక విషయాలపై స్పందించారు. కావేరి జలాల వివాదం. కేరళ కర్ణాటక మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

CM Yediyurappa : సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా?

Cm Yediyurappa

CM Yediyurappa : కర్ణాటకలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీలో కేంద్ర పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు యడియూరప్ప. ఈ సందర్బంగా అనేక విషయాలపై స్పందించారు. కావేరి జలాల వివాదం. కేరళ కర్ణాటక మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను మోదీకి తెలిపారు సీఎం, ఇక కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకెదాటు ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు యడియూరప్ప. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చించినట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన తన రాజీనామా ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తన కుమారుడికి ప్రాధాన్యతక కలిగిన పోస్ట్ ఇవ్వాలని యడియూరప్ప ప్రధాని మోదీని కోరినట్లు తెలుస్తుంది.

మోదీతో భేటీ అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు యడియూరప్ప. పార్టీ విషయాలు చర్చించారు. ఇక ఇదిలా ఉంటే బీజేపీ కొత్త నిబంధన ప్రకారం 75 ఏళ్ళు దాటినవారు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి ఉంది. అయితే ఈ యడియూరప్ప విషయంలో మినహాయింపు ఇచ్చారు. ఈయన 77 ఏళ్ల వయసులో కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 2019 నుంచి కర్ణాటక సీఎంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 79 ఏళ్ళు