Karnataka Politics: కర్ణాటక అసెంబ్లీని గోమూత్రంతో శుభ్రం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. డీకే ఆదేశాల మేరకే ఇలా చేశారట

అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరిలో బీజేపీపై డీకే శివకుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సువర్ణ విధానసౌధను గోమూత్రంతో శుద్ధి చేస్తామని ఆయన చెప్పారు. బీజేపీ అవినీతి వల్ల విధానసభ భవన్‌ కలుషితమైందన్నారు. అన్నట్టుగానే తాజాగా శుభ్రం చేయించారు.

Karnataka Politics: కర్ణాటక అసెంబ్లీని గోమూత్రంతో శుభ్రం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. డీకే ఆదేశాల మేరకే ఇలా చేశారట

Vidhana Soudha: కర్ణాటక కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం అసెంబ్లీని గోమూత్రం, డెటాల్‌తో శుభ్రం చేశారు. అవినీతిలో కూరుకుపోయిన బీజేపీ ప్రభుత్వం పోయినందున, శాసనసభ ప్రాంగణాన్ని ఇలా భుభ్రం చేయాల్సిన అవసరం ఏర్పడిందని కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో డీకే శివకుమార్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో.. తాము అధికారంలోకి రాగానే శాసనసభను గోమూత్రంతో శుభ్రం చేస్తామంటూ విరుచుకుపడ్డారు. అయితే ఆ వాగ్దానం నెరవేర్చేందుకే కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం ఈ పని చేశారు.

Karnataka: సీఎంని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్.. నిమిషాల్లోనే సస్పెండైన ప్రభుత్వ టీచర్

కాంగ్రెస్ ఘనవిజయం సాధించి, కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్టీ కార్యకర్తలు సోమవారం అసెంబ్లీకి చేరుకుని శుద్ధిలో నిమగ్నమయ్యారు. బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. పరిపాలన, పాలన స్వచ్ఛంగా, అవినీతి రహితంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకుంటుందని వారు చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు శివకుమార్ ఏం చెప్పారు?
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరిలో బీజేపీపై డీకే శివకుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సువర్ణ విధానసౌధను గోమూత్రంతో శుద్ధి చేస్తామని ఆయన చెప్పారు. బీజేపీ అవినీతి వల్ల విధానసభ భవన్‌ కలుషితమైందన్నారు. అన్నట్టుగానే తాజాగా శుభ్రం చేయించారు.

PM Narendra Modi : మోదీ మరో అరుదైన ఘనత .. రెండు దేశాల అత్యున్నత పురస్కారాలు అందుకున్న భారత ప్రధాని

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో మొత్తం 224 స్థానాల్లో కాంగ్రెస్‌కు పూర్తి కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రెండోసారి ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మరో ఎనిమిది మంది కాంగ్రెస్ నేతలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.