Chikmagalur School : కర్ణాటకలో స్కూల్ లో కరోనా కల్లోలం..101మంది విద్యార్థులకు పాజిటివ్

ఓ వైపు కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"వ్యాప్తి గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో కర్ణాటకలోని ఓ స్కూలో రోజురోజుకీ కోవిడ్ బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.

Chikmagalur School : కర్ణాటకలో స్కూల్ లో కరోనా కల్లోలం..101మంది విద్యార్థులకు పాజిటివ్

School

Chikmagalur School : ఓ వైపు కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”వ్యాప్తి గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో కర్ణాటకలోని ఓ స్కూలో రోజురోజుకీ కోవిడ్ బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. విద్యార్థులతో పాటు పెద్ద ఎత్తున టీచర్లు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు.

చిక్కమంగళూరులోని సిటీలోని జవహార్ నవోదయ స్కూల్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆదివారం ఈ స్కూల్ లో కోవిడ్ కేసుల సంఖ్య 69 కాగా,సోమవారం మరో 32 మందికి పాజిటివ్​గా తేలడంతో ఈ సంఖ్య 101కి చేరింది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో సహా మొత్తం 457 శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా ఈ కేసులు బయటపడినట్లు అధికారులు తెలిపారు.

కరోనా సోకిన వారిలో 90మంది విద్యార్థులు, 11 మంది స్టాఫ్​ ఉన్నారని అధికారులు తెలిపారు. వీరందరి శాంపిల్స్ ను జినోమ్​ సీక్వెన్సింగ్​ కోసం పంపించినట్లు చిక్కమంగళూరు జిల్లా ఆరోగ్య అధికారి ఉమేశ్​ చెప్పారు. కోవిడ్ కలకలం నేపథ్యంలో ఇప్పటికే స్కూల్ ని సీజ్ చేసిన అధికారులు విద్యార్థులకు ట్రీట్మెంట్ కోసం వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని అక్కడ మోహరించారు. రూమ్స్ ను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు.

ALSO READ Next pandemic : రాబోయే వైరస్ లు మరింత ప్రమాదకరంగా ఉండొచ్చు!