Dalits into temples : తొలిసారి దేవాలయాల్లో అడుగు పెట్టిన దళితులు..సంతోషంగా ఉందంటూ కన్నీరు

ఓ గ్రామంలో దళితులు మొదటిసారిగా దేవాలయాలను దర్శించుకున్నారు. ఈ ఆనందంతో వారుకన్నీరు పెట్టుకున్నారు.ఇన్నాళ్టికి మేం భగవంతుడిని చూశాం అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

Dalits into temples : తొలిసారి దేవాలయాల్లో అడుగు పెట్టిన దళితులు..సంతోషంగా ఉందంటూ కన్నీరు

Dalits Entry Into The Temple

dalit families of dindagur visit temples for first time : దేవుడు ఒక్కడేనని వేదాలు చెప్పే ఈ మనుషులే మనుషులంతా ఒక్కటే అని మాత్రం అనరు. అగ్రకులాలు, దిగువ కులాలు అని విడదీసి చూస్తారు. అంటరానివారు అంటూ దూరం పెడతారు.అలా అంటరానివారిగా పరిగణించబడే దళితులకు దేవాలయాల్లోకి రాకూడదని..అలా దళితులు దేవాలయాల్లోకి వస్తే దేవుడు మైలపడిపోయాడని గగ్గోలు పెడతారు. ముఖ్యంగా ఉత్తరాదిన ఇటువంటి అంటరానితనం ఎక్కువగా ఉంటుంది.

దళితులు దేవాలయంలోకి వచ్చారని దారుణమైన శిక్షలు వేసిన ఘటనలు ఎన్నో జరిగాయి. దీంతో దళితులు ఆ భగవంతుడికి కళ్లారా చూడాలనే ఆకాంక్ష ఉన్నా దేవాయలంలోకి అడుగు పెట్టే ధైర్యం చేయరు. కానీ ఓ గ్రామానికి చెందిన దళితులు తొలిసారిగా దేవాలయంలోకి అడుగుపెట్టారు. దాంతో వారి ఆనందం అంతా ఇంతా కాదు. భగవంతుడికి ఇన్నాళ్లకు కళ్లారా చూశామని తెగ ఆనందపడిపోతున్నారు. ఆ ఆనందంలో కన్నీరు పెట్టుకున్న ఘటన కర్నాటకలోని హసన్ జిల్లాలో ఉన్న చెన్ననారాయపట్న తాలూకాలోని దిండగురు గ్రామంలో జరిగింది.

Read more : Caste Discrimination : గుడికి వెళ్లిన దళితుడు..అపవిత్రం అయ్యిందంటూ 25 వేలు జరిమానా..

దిండగురు గ్రామ దళితులు తొలిసారిగా పలు దేవాయాలను దర్శించుకున్నారు.పోలీసులు, ఉన్నత అధికారుల సమక్షంలో ఆ ఊరి ఎస్సీలు మంగళవారం ( సెప్టెంబర్ 28,2021) ఆలయాలను సందర్శించారు. మేం కూడా దేవాలయాలను దర్శించాలనుకుంటున్నామయ్యా అంటూ దిండగురు గ్రామ దళితులు తాలూకా అధికారులకు లేఖ రాశారు.

వారి కోరికను అర్థం చేసుకున్న అధికారులు గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా తహిసిల్దారు జేబీ మారుతి, డిప్యూటీ ఎస్పీ లక్ష్మీ గౌడలు గ్రామ పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేసి చర్చించారు. ఉన్నత కులస్తులతోనూ వాళ్లు సమావేశం పెట్టి.. దళితులు ఆలయ ప్రవేశం చేసేందుకు అనుమతి తీసుకున్నారు.

Read more : దళితులకు హెయిర్‌ కట్‌ చేసాడని బార్బర్ కుటుంబాన్ని వెలివేసి..రూ.50వేలు జరిమానా

అనంతరం దళితులు ఆలయాలకు వెళ్లటానికి దళితులకు ఎటువంటి ఆంక్షలు లేవని తహిసిల్లాదర్ తెలిపారు. వారికి రక్షణ కూడా ఇస్తామని తెలిపారు. దీంతో దళితులంతా ఆ గ్రామంలో ఉన్న మల్లేశ్వర ఆలయం, బసవన్న ఆలయం, సంత్యమ్మ, కేశవ ఆలయాలను దళితులు సందర్శించుకున్నారు. తొలిసారి గుడిలోకి అడుగుపెట్టినట్లు ఆ ఊరికి చెందిన 75 ఏళ్ల తిమ్మయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు మేం ఆ భగవంతుడిని దర్శించుకున్నామని తెలిపారు.

Read more : MP: దళితుడువి జెండా ఎగురవేస్తావా..అంటూ సర్పంచ్ పై కార్యదర్శి దాడి