Caste Discrimination : గుడికి వెళ్లిన దళితుడు..అపవిత్రం అయ్యిందంటూ 25 వేలు జరిమానా..

నాలుగేళ్ల పిల్లాడిని తీసుకుని గుడికి వచ్చాడని దళుతుడికి గ్రామ పెద్దలు రూ.25వేలు జరిమానా వేసిన ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

10TV Telugu News

Caste Discrimination In Karnataka  : ఇది కంప్యూటర్ యుగం. టెక్నాలజీలో దూసుకుపోతున్నాం. వైద్య రంగంలో పెనుమార్పులు వస్తున్నాయి.శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ దూసుకుపోతోందని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఈ కంప్యూటర్ రోజుల్లో కూడా కులగజ్జి పోవటంలేదు. భగవంతుడికి కులమతాలు లేవని చెబుతున్న పెద్దలే దళితుల్ని దేవాలయల్లోకి అడుగు కూడా పెట్టనివ్వని అమానుష అనాగరిక ఘటనలు ఇంకా భారత్ లో కొనసాగుతునే ఉన్నాయి. నాలుగేళ్ల కొడుకు పుట్టిన రోజన గుడి వెళ్లాలని ఆశపడిన కొడుకు ముచ్చట తీర్చటం కోసం గుడికి వెళ్లిన ఓ దళితుడికి రూ.25వేలు జరిమానా వేసిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

దళితులపై వివక్షలు, అణచివేతలు, కులం పేరుతో దూషణలు, అమానుష శిక్షలు జరుగుతునే ఉన్నాయీ భారతదేశంలో. తన నాలుగేండ్ల కొడుకు పుట్టిన రోజున గుడికి తీసుకెళ్లాడో తండ్రి. గుడి బయట నుంచే దేవుడికి దండం పెట్టుకున్నారు. లోపలికి అడుగు కూడా పెట్టలేదు. అయినా సరే దళితుడి గాలి సోకి దేవాలయం అపవిత్రం అయిపోయిందని గగ్గోలు పెట్టి ఆ దళితుడకి రూ.25వేలు జరిమానా వేసిన ఘటన కర్ణాటకలోని కొప్పాల్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అనాగరిక ఘటన వివరాల్లోకి వెళితే..కర్ణాటకలోని కొప్పాల్‌ జిల్లాలోని మియాపుర గ్రామంలో దళిత వర్గానికి చెందిన చెన్నదాస కమ్యూనిటీకి చెందిన 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిపై అగ్రకులస్తులు కుల వివక్ష చూపిస్తుంటారు. దీంతో వారు కూడా వారితో గొడవలు ఎందుకులేఅనుకుని జీవిస్తున్నారు. ఈక్రమంలో సెప్టెంబర్ 4వతేదీన దళితులకు చెందిన ఓ కుటుంబంలో నాలుగేండ్ల బాలుడు పుట్టిన రోజు వచ్చింది. చక్కగా తలస్నానం చేసి..కొత్తబట్టలు వేసుకున్న ఆ పిల్లాడు గుడికి వెళదాం అని ముచ్చటపడ్డాడు.

Read more : దళితులకు హెయిర్‌ కట్‌ చేసాడని బార్బర్ కుటుంబాన్ని వెలివేసి..రూ.50వేలు జరిమానా

దీంతో ‘నానా దేవుడి దగ్గరకెళదాం’అంటూ ముద్దు ముద్దుగా అడిగాడు. దానికి తండ్రి కాదనలేకపోయాడు. కొడుకుని తీసుకుని ఆ గ్రామంలో ఉండే దేవాలయానికి వెళ్లాడు. కానీ తమపై అగ్రకులస్తులు చూపించే వివక్ష గురించి తెలిసిన ఆ తండ్రి గుడి లోపలికి వెళ్లకుండా బయటనుంచే దణ్ణం పెట్టుకుని కొడుకుతో కూడా దేవుడికి దణ్ణం పెట్టించాడు.వారిని చూసిన పూజారి గుడిలోకి రావటానికి వీల్లేదు అంటూఅడ్డుకున్నాడు. కానీ చిన్నపిల్లాడు కదా..సాటి మనుషులపై కూడా వివక్ష ఉంటుందని తెలియని పసివాడు గుడిలోపలికి పరుగుపెట్టాడు. అది చూసిన పూజారి ఏదో ఉపద్రవం ముంచుకొచ్చేసినట్లుగా కేకలు పెడుతూ ‘అయ్యో అయ్యో..ఏంటీ అపచారం..దేవాలయాన్ని అపవిత్రం చేసేశావు కదారా’అంటూ మండిపడ్డాడు. దీంతో తండ్రి కొడుకుని తీసుకుని గుడి  బయటి నుంచే ఆ భగవంతుడిని మొక్కుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Read more : చిత్తూరు: కుటుంబాలను వెలివేసి..ఇళ్ల చుట్టూ ఇనుప కంచె కట్టేసిన నెర్నపల్లి గ్రామ పెద్దలు

కానీ పూజారి ఊరుకోలేదు. గ్రామ పెద్దలకు ఈ విషయం చెప్పాడు. అంతే సెప్టెంబర్‌ 11న గ్రామ పెద్దలు సమావేశం నిర్వహించారు. ఆ తండ్రీ కొడుకుల వల్ల ఆలయం అపవిత్రమయిందని..గుడిని ప్రక్షాళన చేయాలని కాబట్టి రూ.25 వేలు జరిమానా కట్టాలని తీర్మానించారు. సదరు దళితుడు రూ.25వేలు కట్టాలని తీర్పు తీర్చారు. దీంతోపాటు ఆలయ శుద్ధి చేయటానికి అదనంగా కి ఖర్చుగా మరో రూ.10 వేలు ఇవ్వాలని తీర్మానం చేశారు. అంత పెద్దమొత్తం చెల్లించలేమని వేడుకున్నాడా బాధితుడు. ఆ విషయం గుడికి వెళ్లకముందు తెలియదా? అంటూ వెటకారంగా మాట్లాడారు గ్రామ పెద్దలు.

ఈ విషయం తెలిసిన పోలీసులు సదరు బాధితుడికి ప్రశ్నించగా..ఫిర్యాదు చేయడానికి అంగీకరించలేదు. కానీ కొంతమంది మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. కానీ దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు మరోవైపు నుంచి దీనిపై చొరవ తీసుకున్నారు.

Read more : MP: దళితుడువి జెండా ఎగురవేస్తావా..అంటూ సర్పంచ్ పై కార్యదర్శి దాడి

దీంట్లో భాగంగా మియాపూరకు వెళ్లిన పోలీసులు గ్రామపెద్దలతో సమావేశం నిర్వహించారు. విషయం గురించి ప్రస్తావించగా..అటువంటిదేమీ లేదని వారు తెలిపారు. దీంతో పోలీసులు సదరు గ్రామ పెద్దలకు వార్నింగ్ ఇస్తూ..‘మరోసారి ఇలాంటి ఘటనలు జరిగేత చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’అని హెచ్చరించారు.ఆ తరువత బాధిత కుటుంబానికి క్షమాపణలు చెప్పించారు. ఈ విషయాన్ని స్థానిక తహసీల్దార్‌ సిద్దేశ్‌ వెల్లడించారు. కాగా కొన్ని రోజుల్లో కుల వివక్ష పోవాలని ఈ మార్పు అందరిలోను రావాలనే సదుద్ధేశ్యంతో గ్రామంలోని అన్ని వర్గాలతో ఆలయ ప్రవేశ కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా ఎస్పీ టీ శ్రీధర్‌ వెల్లడించారు. భగవంతుడు ఏ ఒక్క సామాజిక వర్గానికో చెందినవాడు కాదని అందరివాడు అని తెలిపారు.

10TV Telugu News