కర్ణాటక కీలక నిర్ణయం…డిగ్రీ,పీజీ పరీక్షలు రద్దు

  • Published By: venkaiahnaidu ,Published On : July 10, 2020 / 07:59 PM IST
కర్ణాటక కీలక నిర్ణయం…డిగ్రీ,పీజీ పరీక్షలు రద్దు

క‌రోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కర్ణాటకలో అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలో నిర్వ‌హించాల్సిన డిగీ, పోస్టు గ్రాడ్యుయేట్ ప‌రీక్ష‌ల‌ను యడియూరప్ప సర్కార్ ర‌ద్దు చేసింది. ఈ మేరకు అధికారిక నిర్ణయాన్ని శుక్రవారం వెల్లడించింది.

కేవ‌లం చివ‌రి సెమిస్ట‌ర్ విద్యార్థుల‌కు మాత్ర‌మే ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ చివ‌రి నాటికి ఫైన‌లియ‌ర్ విద్యార్థుల‌కు యూజీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించింది.

గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్, ఇంజినీరింగ్, డిప్లొమా కోర్సులు చదువుతున్న విద్యార్థులంద‌రినీ పై త‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్ చేయ‌నున్నారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి ఆన్ లైన్ క్లాసుల‌ను సెప్టెంబ‌ర్ 1 నుంచి ప్రారంభించ‌నున్నారు. కేంద్రం, యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి అక్టోబర్ 1 నుంచి గానీ.. ఆ తర్వాత గానీ ఆఫ్‌లైన్‌లో క్లాసులను నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.