Karnataka: పొలంలో బావి కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్!

రాజావారి చేపల చెరువు సినిమా చూసారా.. అందులో పోసాని కృష్ణమురళి తన పొలంలో చేపల చెరువులు ఎవరో దొంగిలించారని.. అందులో చేపలన్నిటినీ దొంగలెత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఎలాగైనా తన చేపల చెరువులను వెతికి పట్టుకొని తనకు అప్పగించాలని పోలీసుల, అధికారులను పీడిస్తాడు.

Karnataka: పొలంలో బావి కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్!

Karnataka

Karnataka: రాజావారి చేపల చెరువు సినిమా చూసారా.. అందులో పోసాని కృష్ణమురళి తన పొలంలో చేపల చెరువులు ఎవరో దొంగిలించారని.. అందులో చేపలన్నిటినీ దొంగలెత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఎలాగైనా తన చేపల చెరువులను వెతికి పట్టుకొని తనకు అప్పగించాలని పోలీసుల, అధికారులను పీడిస్తాడు. నిజానికి అక్కడ అసలు ఎలాంటి చెరువు లేదు.. చేపలు లేవు. అధికారులు అవినీతికి పాల్పడి రికార్డులను సృష్టిస్తే.. ఆ దొంగ రికార్డులను అడ్డుపెట్టుకొని పోసాని బ్యాంకు రుణాన్ని పొందుతాడు

అచ్చంగా అలాంటి ఎపిసోడ్ ఒకటి నిజజీవితంలో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తన పొలంలోని బావి కనిపించడం లేదని.. ఎలాగైనా దానిని వెతికి పెట్టాలని ఓ రైతు పోలీసులను వేడుకున్నాడు. కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలోని భేండవాడ గ్రామ పంచాయతీ పరిధి మావినహొండ గ్రామంలో ఈ వింత చోటుచేసుకుంది. మల్లప్ప అనే రైతు తన కుమారులతో కలిసి రాయబాగ్‌ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో అవాక్కవడం పోలీసుల వంతైంది.

అసలు నిజం ఏమిటంటే.. గ్రామ పంచాయతీ అధికారులు రైతు మల్లప్ప పొలంలో బావిని తవ్వినట్లు రికార్డు సృష్టించి ప్రభుత్వ నిధులను కాజేశారు. అయితే, బావి తవ్వించుకున్నందుకు తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలంటూ అధికారుల నుండి రైతుకు ఇటీవల నోటీసులు అందాయి. అసలు ఋణం తీసుకోవడం ఏమిటి.. తన పొలంలో ఎప్పుడు తవ్వించామని అర్ధంకాని ఆ రైతు ఆరా తీయడంతో అధికారుల నిర్వాకం బయటపడింది. దీంతో ముల్లును ముల్లుతోనే తీయాలని భావించిన రైతు తాను ఋణం తీసుకొని మరీ తవ్వించిన బావి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.