ఫుడ్ డెలివరీ ఉమెన్ పొలిటికల్ ఎంట్రీ

  • Published By: veegamteam ,Published On : November 11, 2019 / 10:35 AM IST
ఫుడ్ డెలివరీ ఉమెన్ పొలిటికల్ ఎంట్రీ

టెక్నికల్ ఎగ్జిక్యూటీవ్ గా కెరీర్ ప్రారంభించి..ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ జొమాటోకి ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా మారిని మేఘనా దాస్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.కర్ణాటకలోని మంగళూరు నగరానికి చెందిన మేఘనా దాస్ ఫుడ్ డెలివరీ ఉమెన్‌గా పనిచేశారు. త్వరలో జరగనున్న మంగళూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్టుపై మన్నగూడ వార్డు  నెం. 28 నుంచి పోటీ చేస్తున్నట్లు మేఘనాదాస్ ప్రకటించారు. దీనికి సంబంధించి మేఘనా నామినేషన్ కూడా దాఖలు చేశారు. ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. 

ఫుడ్ డెలివరీ ఉమెన్ గా అధ్వానంగా మారిన రోడ్లపై మోటర్ సైకిల్ నడుపుతూ చాలా ఇబ్బందులు పడ్డానని..ఆ క్రమంలో తాను టూవీలర్ నడుపుతూ కింద పడిపోయానని తెలిపారు. ప్రతీరోజూ వారి వారి పనులపై రోడ్లపై ప్రయాణం చేయడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేను ప్రత్యక్షంగా చూశాననీ..అందుకే ప్రజల సమస్యలను తీర్చగలననే నమ్మకంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నానని..అందుకే ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించానని మేఘనా చెప్పారు. మేఘనా దాస్ మంగళూరు నగరంలోని మన్నగుడ్డ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడ్డారు.

తనకు టిక్కెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా మేఘనా ధన్యవాదాలు తెలిపారు. కష్టాలు తెలిసిన తనను తనను గెలిపిస్తే ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. పరతీ 10 రోజులకు ఇకసారి ప్రజలతో సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. కష్టపడి పనిచేస్తే ఫలితాలు కూడా మంచిగా వస్తాయని మేఘనాదాస్ అన్నారు.