Karnataka : ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్

ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్ కల్పంచాలని నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక ప్రభుత్వం రికార్డు క్రియేట్ చేసింది.

Karnataka : ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్

Karnataka Govt

Karnataka reservations for transgender in govt jobs : కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్ కల్పంచాలని నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇటువంటి సంచలన, కీలక నిర్ణయం తీసుకుని అమల్లోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా రికార్డులకెక్కింది. రిజర్వు కానిస్టేబుల్, బ్యాండ్స్‌మెన్ ఉద్యోగ నియామకాల్లో ట్రాన్స్‌జెండర్లకు అవకాశం కల్పించకపోవడంపై సంగమ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్‌పై కర్ణాటక హైకోర్టులో వాదనలు జరిగిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ… రిజర్వేషన్ల విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఒకశాతం రిజర్వేషన్ కల్పించామని తెలిపారు.

దీనిపై రాష్ట్ర ధర్మాసనం స్పందిస్తూ..ట్రాన్స్‌జెండర్ల కోటా విషయంలో కేంద్రం ఎటువంటి నిబంధనలు అమలు చేయబోతోందో రెండు వారాల్లోగా చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. కాగా..ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్ కల్పించటానికి…అమలు చేయటానికి 1977 లో కర్ణాటక సివిల్ సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ (రూల్స్) కు సవరణలు చేసినట్లు చీఫ్ జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా , జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ ల డివిజన్ బెంచ్ కు సమాచారం ఇచ్చింది ప్రభుత్వం.

ట్రాన్స్ జెండర్లు కూడా సాధారణ వ్యక్తులవంటివారేనని వారికి కూడా అందరిలా సమాన జీవించే హక్కు ఉందని ప్రభుత్వం భావించిందని ఈ సందర్భంగా ధర్మాసనానికి ప్రభుత్వం వివరించింది. ఇలా లింగమార్పిడి చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో 1 శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది.