బార్లు, రెస్టారెంట్లు ఓపెన్..కండీషన్ అప్లై

  • Published By: madhu ,Published On : May 9, 2020 / 04:11 AM IST
బార్లు, రెస్టారెంట్లు ఓపెన్..కండీషన్ అప్లై

భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు కేసులు పెరుగుతుండడం..సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. 2020, మార్చి 24వ తేదీ నుంచి దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 17 వరకు ఈ నిబంధన అమల్లో ఉండనుంది. మూడుసార్లు లాక్ డౌన్ పొడిగించినా…కేసులు తక్కువ కాకపోగా..ఇంకా అధికమౌతున్నాయి. ఈ క్రమంలోనే..కొన్నింటికి సడలింపులు ఇచ్చింది కేంద్రం. 

రాష్ట్రాలకు అధిక ఆదాయం తెచ్చే మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రాలు లిక్కర్ సేల్స్ కు పచ్చజెండా ఊపాయి. కేంద్రం విధించిన నిబంధనలు పాటిస్తూ..మద్యం విక్రయాలు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించాయి. ఇక్కడ మద్యం దుకాణాలకు మాత్రమే ఫర్మిషన్ ఇచ్చారు. బార్లు, రెస్టారెంట్ నో చెప్పారు. 

కానీ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బార్లు, రెస్టారెంట్లు తెరుచుకోవచ్చని వెల్లడిస్తూ..ఒక కండీషన్ పెట్టింది. 2020, మే 9 నుంచి 17 వరకు మద్యాన్ని రిటైల్ ధరలకు అమ్ముకోవచ్చని,  మద్యాన్ని కొనుగోలు చేసి తీసుకుని వెళ్ళడానికి మాత్రమే అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం కరోనా వైరస్ ఇక్కడ కంట్రోల్ లోనే ఉందని, కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వెల్లడిస్తోంది. మద్యాన్ని ఇంటికి పంపించే అంశంపై ప్రభుత్వం ఆలోచించడం లేదని, చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని మంత్రి నాగేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Read More :

మందుబాబులకు షాక్…మద్యం షాపులు క్లోజ్

Liquor Home Delivery గురించి రాష్ట్రాలు ఆలోచించాలి: సుప్రీం కోర్టు