Karnataka Politics: కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్‭కు కేటాయించిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా?

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం హిజాబ్ నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని చూస్తున్న నివేదికల మధ్య “రాష్ట్ర ప్రతిష్టకు తిరోగమనం” కలిగించే అన్ని ఉత్తర్వులు, బిల్లులను సమీక్షిస్తుందని మంత్రి ప్రియాంక్ ఖర్గే చెప్పిన కొద్ది రోజుల తరువాత మంత్రులు ఈ వ్యాఖ్యలు చేశారు

Karnataka Politics: కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్‭కు కేటాయించిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా?

RSS to BJP: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సంస్థకు కేటాయించిన భూములను కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకోనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బొమ్మై ప్రభుత్వంలో ఆర్ఎస్ఎస్ సంస్థకు వివిధ ప్రదేశాల్లో కేటాయించిన వందల ఎకరాల భూములపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది.

Opposition Parties Meet: ఆరంభానికి ముందే అవరోధాల్ని ఎదుర్కొంటున్న విపక్ష పార్టీల సమావేశం? నితీశ్ నెట్టుకొస్తారా?

ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న సంస్థలకు భూ కేటాయింపులపై సమీక్షిస్తామని రాష్ట్ర మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. “గత భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం జారీ చేసిన కొన్ని టెండర్లు రద్దు చేశాము. మరికొన్నింటిని పరిశీలిస్తాము” అని ఆయన చెప్పారు. రాష్ట్ర మంత్రి కృష్ణ బైరేగౌడ మాట్లాడుతూ “వచ్చే క్యాబినెట్ సమావేశంలో మేము దీనిని పరిశీలిస్తాము. బీజేపీ ప్రభుత్వ హయాంలో గత కొన్ని నెలల్లో హడావుడిగా చాలా సంస్థలకు భూమిని కట్టబెట్టారు. అలా ఎలా కట్టబెడతారు?” అని అన్నారు.

Digital India Bill: ఇంటర్నెట్‭పై కేంద్రం కఠిన ఆంక్షలు.. 11 అంశాలతో కొత్తగా డిజిటల్ ఇండియా బిల్లు

2019 నుంచి 2023 వరకు మాత్రమే కాకుండా 1947 నుంచి భూ కేటాయింపులను పరిశీలించాలని సిద్ధరామయ్య ప్రభుత్వంపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. “అన్ని కేటాయింపులను పరిశీలించాలి. కేవలం బీజేపీ పదవీకాలం మాత్రమే ఎందుకు?” అని మాజీ విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ అన్నారు.

Karnataka Politics: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్న కర్ణాటక ప్రభుత్వం.. ఎమ్మెల్యేలకు సీఎం ఆదేశాలు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం హిజాబ్ నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని చూస్తున్న నివేదికల మధ్య “రాష్ట్ర ప్రతిష్టకు తిరోగమనం” కలిగించే అన్ని ఉత్తర్వులు, బిల్లులను సమీక్షిస్తుందని మంత్రి ప్రియాంక్ ఖర్గే చెప్పిన కొద్ది రోజుల తరువాత మంత్రులు ఈ వ్యాఖ్యలు చేశారు. “కర్ణాటక ప్రతిష్టకు తిరోగమనం కలిగించే అన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులు, ప్రభుత్వ ఉత్తర్వులు, బిల్లులను మేము సమీక్షిస్తాము” అని ప్రియాంక్ ఖర్గే చెప్పారు.