Modern indian women : ‘సరోగసీ’ద్వారా పిల్లల్ని కనాలనుకునే మహిళల పోకడలు మంచిది కాదు: మంత్రి వ్యాఖ్యలు

భారతీయ మహిళలు పాశ్చాత్యపోకడలకు పోతున్నారని..పెళ్లి వద్దు..పిల్లలు వద్దు అంటున్నారనీ..ఒక వేళ పిల్లల్ని కనాలనుకున్నాగానీ..సరోగసీ ద్వారానే కావాలనుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యనించారు.

Modern indian women : ‘సరోగసీ’ద్వారా పిల్లల్ని కనాలనుకునే మహిళల పోకడలు మంచిది కాదు: మంత్రి వ్యాఖ్యలు

Karnataka Minister Controversial Comments On Modern Indian Women

karnataka minister modern indian women : కర్ణాటక ఆరోగ్య మంత్రి K.సుధాకర్ భారతీయ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత మహిళలు పాశ్చత్యపోకడలకు పోతున్నారని..ఆధునిక భారతీయ మహిళలు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారనీ..వివాహం అయ్యాక కూడా పిల్లల్ని కనటానికి ఇష్టపడటంలేదు..ఒకవేళ పిల్లల్ని కనాలనుకున్నా..సరోసగీ ద్వారానే కనాలనుకుంటున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (World Mental Health Day) సందర్భంగా బెంగళూరులోని జాతీయ మానసిక ఆరోగ్యం, న్యూరోలాజికల్ సైన్సెస్ లో ఆదివారం (10,2021)జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తు ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more : Extra Marital Affair : మహిళతో సహజీవనం… ఆమె కుమార్తెపై అత్యాచారం

ఈ సందర్భంగా మంత్రి ఇంకా పలు వ్యాఖ్యలు చేస్తు..ఈరోజు నేను ఈ విషయం మాట్లాడుతున్నందుకు క్షమించండి..ఆధునిక భారత మహిళల్లో చాలా మంది ఒంటరిగా ఉండాలనుకునేవారే ఎక్కువగా ఉన్నారని అన్నారు. ఒక వేళ వివాహం చేసుకున్నా..పిల్లలకు జన్మనివ్వడానికి ఇష్టపడట్లేదని ఒకవేళ కనాలని ప్లాన్ చేసుకున్నాగానీ..‘అద్దెగర్భాల (surrogacy)ద్వారానే కనాలనుకుంటున్నారని అన్నారు. మన భారతీయ సమాజంపై పాశ్చాత్యపోకడల ప్రభావం బాగా ఉంటుందని అన్నారు. ఇటువంటి ఆలోచన విధానం ఎంతమాత్రం మంచిది కాదని అన్నారు. ఈక్రమంలో మంత్రిగారి వ్యాఖ్యలపై మహిళలు,మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నారు. మంత్రిగారి వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

అంతేకాదు..భారతీయ సమాజం దురదృష్టవశాత్తు పాశ్చాత్య మార్గంలోకి వెళుతున్నాం..ఆఖరికి మనల్ని కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను మనతో ఉంచుకోవటానికి కూడా ఇష్టపడటం లేదనీ..మన తాతలు, నాయనమ్మలు అమ్మమ్మలతో కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదని అటువంటి సంస్కృతులను మనం మరచిపోతున్నాం..దూరం చేసుకుంటున్నాం అని అన్నారు.

Read more : Viral letter : ఇంట్లో డబ్బుల్లేకపోతే తాళం ఎందుకేశారు? కలెక్టర్ ఇంట్లో చోరీ చేసిన దొంగల లేఖ

దేశంలోని ప్రతి ఏడుగురు భారతీయుల్లో ఒకరు మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈ సమస్యలు ఒత్తిడి వల్ల వచ్చేవేనని అన్నారు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మన పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప వరాలు..వాటితో ఒత్తిడిని జయించవచ్చు.వేలాది ఏళ్ల కిందటే మనభారతీయులు వీటిని ప్రపంచానికి బోధించారు.వాటిని అలవరచుకుని..ఒత్తిడిని దూరం చేసుకోవాలని మంత్రి సుధాకర్ సూచించారు.కోవిడ్-19 మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని అన్న మంత్రి..కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను తాకడానికే కాదు, కనీసం దగ్గరకు కూడా బంధువులు చేరడం లేదని..ఇది ఓ మానసిక సమస్య అని అన్నారు.కాగా..మంత్రిగారు ప్రసంగించిన ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కూడా హాజరయ్యారు. ఒత్తిడిని జయింటానికి ప్రతీ ఒక్కరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని..అలాగే ఒత్తిడి వల్ల మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎం వ్యాఖ్యానించారు.