మాస్క్ లేకుండా పెళ్లికి వెళ్లిన ఆరోగ్య శాఖా మంత్రి..భౌతిక దూరం మాటేలేదు..

  • Published By: nagamani ,Published On : June 15, 2020 / 11:15 AM IST
మాస్క్  లేకుండా పెళ్లికి వెళ్లిన ఆరోగ్య శాఖా మంత్రి..భౌతిక దూరం మాటేలేదు..

కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి. శ్రీరాములు  మాస్కు ధరించకుండా మాజీ మంత్రి పరమేశ్వర్‌ నాయక్‌ కుమారుడి వివాహానికి వచ్చారు.  దావణగెరెలోని హగరిబోమ్మనహళ్లిలో సోమవారం (జూన్ 14,2020)న జరిగిన పరమేశ్వర్ నాయక్ కుమారుడి వివాహానికి వచ్చారు. ఈ వేడుకకు హాజరైన ఆరోగ్యశాఖ మంత్రి బి శ్రీరాములు మాస్కు ధరించకపోవటంతో  విపక్ష నేతలతోపాటు పలువురు దీనిపై విమర్శలు గుప్పించారు. మరోవైపు ఈ పెళ్లికి ఎంతోమంది ప్రముఖులతోపాటు బంధుమిత్రులు..స్నేహితులు భారీగా వచ్చారు. దీంతో సామాన్యులకేనా ఈ కరోనా నిబంధనలు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో మాస్క్ లు ధరించకుండా బైటకు రావద్దని చెబుతున్న ప్రజాప్రతినిధులే ఆ నిబంధనలకు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీనికి మంత్రులు అదే చేయటంతో నిబంధనలు సామాన్య మనుషులకేనా వాళ్లు మంత్రులు..ఎమ్మెలు అయితే వారికి వర్తించవా అంటూ మండిపడుతున్నారు ప్రజలు. ఆరోగ్య శాఖమంత్రి కూడా మాస్క్ లు ధరించకుండా బైటకు రావటం..అదీ కూడా ఓ పెళ్లి వేడుకకు రావటంతో సామాన్యులు మండిపడుతున్నారు. 

ఓ మంత్రి పైగా ఆరోగ్య శాఖ మంత్రి అయివుండి ఇలా ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఈ పెళ్లివిందులో మాస్క్ లేకుండానే రావటం..ఏమాత్రం భౌతిక దూరం పాటించకుండా అందరూ రాసుకుంటూ పూసుకుంటూ తిరగటం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఈకరోనా కాలంలో పెళ్లిళ్లకు 50మందికి మించి ఉండకూడదనే నిబంధలను మాత్రం వీరికి వర్తించవన్నమాట. ఎందుకంటే వారు ప్రజలు ఎన్నుకున్ననాయకులు..పైగా రాజకీయ నాయకులు.