Karnataka : కర్ణాటకలో వారాంతపు కర్ఫ్యూ.. రెండు వారాలు కఠిన ఆంక్షలు!

కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ కేసుల తీవ్రత పెరిగిపోవడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Karnataka : కర్ణాటకలో వారాంతపు కర్ఫ్యూ.. రెండు వారాలు కఠిన ఆంక్షలు!

Karnataka Imposes Weekend Curfew

Karnataka Omicron : కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ కేసుల తీవ్రత పెరిగిపోవడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం బెంగళూరులో వారాంతపు కర్ఫ్యూ విధించింది. కోవిడ్ కేసులు దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వారం నుంచే కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వారాంతపు కర్ఫ్యూ విధించనున్నట్టు కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ ఆశోక ప్రకటించారు. వారాంతపు కర్ఫ్యూలో థియేటర్లు, మాల్స్, పబ్బులు, బార్స్ 50 సామర్థ్యంతో నిర్వహించేందుకు అనుమతి ఉందని ఆయన అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి సమావేశాలను నిర్వహించేందుకు అనుమతి లేదని మంత్రి ఆశోక పేర్కొన్నారు. బెంగళూరులోని 10వ, 12వ తరగతులు మినహా జనవరి 6 నుంచి రేపటి నుంచి రెండు వారాల పాటు పాఠశాలలు బంద్ చేయనున్నట్లు మంత్రి ఆశోక వెల్లడించారు.

కర్ణాటకలో నిన్నటి వరకు 64 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో 18మంది కరోనా నుంచి కోలుకున్నారు. అంతకుముందు, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బెంగళూరులో కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యులు నిపుణులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె సుధాకర్, రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్, బీబీఎంపీ కమిషనర్ గౌరవ్ గుప్తా, ముఖ్య కార్యదర్శి, డీజీపీ ప్రవీణ్ సూద్, బీబీఎంపీ అధికారులు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, సాంకేతిక సలహా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సమావేశానికి ముందు, కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్.. ఒమిక్రాన్‌ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం.. కోవిడ్ కేసులతో బెంగళూరు రెడ్-జోన్‌లో ఉందన్నారు. అందుకే బెడ్‌లు, ఆక్సిజన్‌తో పాటు అవసరమైన వస్తువులను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. కర్ణాటకలో సోమవారం 1,290 కొత్త కేసులు నమోదు కాగా.. 5 మంది కరోనాతో మరణించారు. కరోనా కేసుల సంఖ్య 30,10,847 చేరగా.. కరోనా మరణాల సంఖ్య 38,351కి చేరింది. కరోనా కొత్త కేసుల్లో 1,041 బెంగళూరుకు చెందినవే ఉన్నాయి.

Read Also : Omicron Kit : ఒమిక్రాన్‌ను గుర్తించే కిట్‌