Karnataka: ప్రతిపక్షాల విమర్శలకు తలొగ్గిన కర్ణాటక సర్కారు.. మద్యపానం అర్హత వయస్సు తగ్గింపుపై వెనుకంజ

కనీసం రూ.29,000 కోట్లు మద్యం అమ్మకాల ద్వారా రాబట్టాలనేది ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు ఒక కొత్త ప్రతిపాదన చేసింది. మద్యం తాగేందుకు ఇంతకుముందు ఉన్న 21 ఏళ్ల అర్హత వయస్సును 18 ఏళ్లకు తగ్గించాలని నిర్ణయించింది.

Karnataka: ప్రతిపక్షాల విమర్శలకు తలొగ్గిన కర్ణాటక సర్కారు.. మద్యపానం అర్హత వయస్సు తగ్గింపుపై వెనుకంజ

Karnataka: మద్యపానం చేసేందుకు అర్హత వయస్సు తగ్గించాలన్న ప్రతిపాదనను కర్ణాటక సర్కారు వెనక్కు తీసుకుంది. ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం వెనకడుగు వేసింది. రాష్ట్రంలో మద్యం ద్వారా ఆదాయం పెంచుకోవాలని సీఎం బసవరాజు బొమ్మై భావించారు.

Secunderabad: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటలు అదుపు చేయలేకపోతున్న సిబ్బంది

2022-23 ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.29,000 కోట్లు మద్యం అమ్మకాల ద్వారా రాబట్టాలనేది ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు ఒక కొత్త ప్రతిపాదన చేసింది. మద్యం తాగేందుకు ఇంతకుముందు ఉన్న 21 ఏళ్ల అర్హత వయస్సును 18 ఏళ్లకు తగ్గించాలని నిర్ణయించింది. 18 వయసు వాళ్లకే మద్యం తాగేందుకు అనుమతివ్వాలన్న నిర్ణయంపై అభిప్రాయాలు తెలపాలని ప్రతిపక్షాలు, ప్రజలను కోరింది. దీనికి నెల రోజుల గడువిచ్చింది. అయితే, ఈ నిర్ణయంపై ప్రజల నుంచి, ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మీడియా సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

Amritsar: ప్రయాణికుల్ని వదిలేసి ఐదు గంటల ముందే వెళ్లిపోయిన విమానం.. విచారణకు ఆదేశించిన డీజీసీఏ

అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. తన ప్రతిపాదనను వెనక్కు తీసుకుంది. రిటైర్డ్ అధికారి వీ యశ్వంత్ ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి కమిటీ ఈ ప్రతిపాదన చేసింది. దీని కోసం ఎక్సైజ్ చట్టంలో మార్పులు తేవాలని సూచించింది. దీంతో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ప్రజల ముందుంచింది. ఇక, ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ద్వారా మద్యం అమ్మకాలు పెంచి, భారీ ఆదాయం పొందాలని చూస్తోంది. రూ.29,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ ఏడాది మార్చి వరకు రూ.30,000 కోట్లు రావొచ్చని అంచనా వేస్తోంది.