Karnataka: కొనసాగుతున్న కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. బెలగావిలో ‘మహా’ నిరసన.. 144 సెక్షన్ విధింపు

కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం ముదురుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్రకు చెందిన పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

Karnataka: కొనసాగుతున్న కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. బెలగావిలో ‘మహా’ నిరసన.. 144 సెక్షన్ విధింపు

Karnataka: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం ఉధృతమవుతోంది. కర్ణాటకలో సీఎం బసవరాజు బొమ్మై వైఖరికి నిరసనగా సరిహద్దులో ఉద్యమం చేసేందుకు పార్టీలు, సంఘాలు సిద్ధమయ్యాయి. కర్ణాటకలో చివరి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బొమ్మై ప్రభుత్వానికి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు.

FIFA World Cup-2022: ఎవరెవరిని ఏయే అవార్డులు వరించాయి?.. అత్యుత్తమ ఆటగాడు ఎవరు?

వచ్చే ఏడాది ప్రభుత్వం రద్దవుతుంది. ఆ తర్వాత ఎన్నికలొస్తాయి. అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. దీంతో చివరి శీతాకాల సమావేశాల సందర్భంగా నిరసన వ్యక్తం చేయాలని మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్ పార్టీతోపాటు, మహారాష్ట్ర ఏకీకారణ్ సమితి (ఎమ్ఈఎస్) సిద్ధమయ్యాయి. బెలగావి సరిహద్దులోని కగ్నోలి టోల్ ప్లాజా వద్ద అన్ని పార్టీలకు చెందిన దాదాపు 300 మంది కార్యకర్తలు నిరసనలకు బయల్దేరారు. అయితే, వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఇక్కడ ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా 144 సెక్షన్ విధించారు. సాధారణంగా ప్రతి సంవత్సరం శీతాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బెలగావి ప్రాంతంలో ఎంఈఎస్ ఆధ్వర్యంలో ఈ నిరసన సభ జరుగుతుంది. ఇరు రాష్ట్రాల సరిహద్దు అంశంలో కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభ నిర్వహించడం ఆనవాయితీ.

Indian Navy ‘INS Mormugao’ : భారత నేవీలోకి మరో భారీ యుద్ధనౌక..మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా నౌకాదళంలో ప్రవేశం..

అయితే, ఈ సారి సభ నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతివ్వలేదు. దీంతో తమ నిరసనను మరింత ఉధృతం చేయాలని ఎంఈఎస్ కార్యకర్తలు భావించారు. అయితే, పోలీసులు ఈ కార్యక్రమం జరగకుండా చర్యలు తీసుకున్నారు. సరిహద్దు ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం దృష్ట్యా అధికారులు బెలగావి ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి నిరసనలకు అనుమతివ్వడం లేదు. దాదాపు 5,000 మంది పోలీసులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.