Bajrang Dal & RSS: కాస్త తేడా కొట్టినా బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్‭లను బ్యాన్ చేస్తాం.. కర్ణాటక మంత్రి హెచ్చరిక

హిజాబ్, హలాల్, గోహత్య వంటి చట్టాలపై ప్రభుత్వం నిషేధాన్ని ఉపసంహరించుకుంటుంది అని ఆయన అన్నారు. “కొన్ని అంశాలు సమాజంలో చట్టానికి, పోలీసులకు భయపడకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మూడేళ్లుగా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. వాటికి బ్రేక్ వేయాలి’’ అని ఖర్గే అన్నారు

Bajrang Dal & RSS: కాస్త తేడా కొట్టినా బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్‭లను బ్యాన్ చేస్తాం.. కర్ణాటక మంత్రి హెచ్చరిక

Priyank Kharge: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బజరంగ్ దళ్‭ను బ్యాన్ చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్. అయితే దీనిపై రైట్ వింగ్ సంస్థలు సహా ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కాస్త వెనక్కి తగ్గి అబ్బెబ్బే అలా ఏం అనలేదు అని బుకాయించింది. ఇక ఆ తర్వాత దాని గురించి అందరూ మర్చిపోయారు. ఎన్నికలు అయిపోయాయి. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అన్నీ చకచకా జరిగిపోయాయి.

Azam Khan: ఎస్పీ సీనియర్ నేత అజాం ఖాన్‭కు భారీ ఊరట.. నిర్ధోషిగా తేల్చిన యూపీ కోర్టు

అయితే ఇక ముగిసిందనుకున్న ఈ వివాదాన్ని మరోసారి తెరపైకి లేపారు ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఏమాత్రం ఆటంకం ఏర్పడినా బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్‭ సంస్థలను నిషేధిస్తామని హెచ్చరించారు. ఈ చర్యలు బీజేపీ అధినాయకత్వాన్ని ఇబ్బందికి గురి చేసినట్లైతే వారు పాకిస్థాన్‌కు వెళ్లొవచ్చని స్పష్టం చేశారు. ‘‘కర్ణాటకను స్వర్గధామంగా మారుస్తామని హామీ ఇచ్చాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే అది బజరంగ్ దళ్, ఆర్‌ఎస్‌ఎస్ అని ఏదీ చూడము. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా వెంటనే నిషేధం విధిస్తాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం భజరంగ్‌దళ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌తో సహా ఏ సంస్థనైనా నిషేధిస్తాం. బీజేపీకి ఇది కష్టంగా అనిపిస్తే, పాకిస్తాన్‌కు వెళ్లిపోవచ్చు’’ అని ఖర్గే పేర్కొన్నారు.

Viral Video: బిల్లు వసూలు చేసేందుకు వచ్చిన విద్యుత్ శాఖ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన వ్యక్తి

హిజాబ్, హలాల్, గోహత్య వంటి చట్టాలపై ప్రభుత్వం నిషేధాన్ని ఉపసంహరించుకుంటుంది అని ఆయన అన్నారు. “కొన్ని అంశాలు సమాజంలో చట్టానికి, పోలీసులకు భయపడకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మూడేళ్లుగా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. వాటికి బ్రేక్ వేయాలి’’ అని ఖర్గే అన్నారు. ‘‘ప్రజలు వారిని (బీజేపీ నేతల్ని) ఎందుకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారో బీజేపీ అర్థం చేసుకోవాలి. కాషాయీకరణ తప్పు అని మేము చెప్పాము. బసవన్న సిద్ధాంతాలను కాంగ్రెస్‌ పాటిస్తుంది’’ ఆయన అన్నారు. ప్రియాంక్ ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీని ‘నాలయక్‌’ అని పిలిచి పెద్ద వివాదం రేపారు.