Karnataka MLA: కొవిడ్ పేషెంట్ల కోసం భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన ఎమ్మెల్యే

నియోజకవర్గంలోని కొవిడ్ పేషెంట్లలో స్ఫూర్తిని నింపేందుకు హొన్నాలీ ఎమ్మెల్యే రేణుకాచార్య అతని భార్య సుమా రేణుకాచార్య కలిసి కొవిడ్ కేర్ సెంటర్ బయట డ్యాన్స్ చేశారు. కర్ణాటకలోని దేవంగిరి జిల్లా న్యామతి కొవిడ్ కేర్...

Karnataka MLA: కొవిడ్ పేషెంట్ల కోసం భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన ఎమ్మెల్యే

Mla Dance

Karnataka MLA: నియోజకవర్గంలోని కొవిడ్ పేషెంట్లలో స్ఫూర్తిని నింపేందుకు హొన్నాలీ ఎమ్మెల్యే రేణుకాచార్య అతని భార్య సుమా రేణుకాచార్య కలిసి కొవిడ్ కేర్ సెంటర్ బయట డ్యాన్స్ చేశారు. కర్ణాటకలోని దేవంగిరి జిల్లా న్యామతి కొవిడ్ కేర్ సెంటర్ లో ప్రస్తుతం 180మంది కొవిడ్ పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

అలా డ్యాన్స్ చేస్తున్న వీడియో… ఆన్‍‌లైన్లో హల్‌చల్ చేస్తుంది. కొన్ని కన్నడ హిట్ సాంగ్స్ పెట్టి వాటికి తగ్గట్లుగా చిందేస్తూ డ్యాన్స్ చేశారు. పేషెంట్లలో స్ఫూర్తిని నింపేందుకు, మహమ్మారిపై పోరాడేలా మోటివేట్ చేసేందుకు ఇలా చేసినట్లు అంటున్నారు.

కొవిడ్-19 పేషెంట్లలో ఉత్సాహం నింపేందుకు డ్యాన్స్ థెరఫీ వాడడం తొలిసారేం కాదు. బుధవారం అస్సాం డాక్టర్ డ్యాన్స్ ఫ్లోర్ మీద చిందేస్తూ కొవిడ్ పేషెంట్లలో జోష్ నింపాడు. ఇతరులలో ఉత్సాహం నింపే అవకాశం రావడం తన అదృష్టమని అంటున్నాడు డాక్టర్.

దేశవ్యాప్తంగా కొవిడ్ నెగెటివ్ అని తెలియడంతో పేషెంట్లు చేసుకుంటున్న సెలబ్రేషన్లో డాక్టర్లు కూడా భాగం అవుతున్నారు. బెంగళూరులోని ఓ డాక్టర్ రికవరీ అయ్యాడని తెలిసి పీపీఈ కిట్ లో ఉన్న డాక్టర్ తో కలిసి డ్యాన్స్ చేశారు. కర్ణాటకలో ఇప్పటివరకూ 20లక్షల రికవరీ కేసులు ఉండగా.. మంగళవారం ఫ్రెష్ గా 22వేల 758కేసులు నమోదయ్యాయి.