73 ఏళ్ళ వృద్ధురాలికి వరుడు కావలెను..షరతులు వర్తిస్తాయి..

73 ఏళ్ళ వృద్ధురాలికి వరుడు కావలెను..షరతులు వర్తిస్తాయి..

73 Years Women Groom Wanted Advertisement

73 years women Groom Wanted Advertisement : వరుడు కావలెను. అనే ప్రకటనలు తరచూ పేపర్లలో చూస్తుంటాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ప్రకటన కాస్త భిన్నంగా ఉంటుంది. ‘‘73 ఏళ్ళ వృద్ధురాలికి వరుడు కావలెను..’’అంతేకాదు ఈ ప్రకటనలో కొన్ని షరతులు కూడా ఉన్నాయి. ఏంటీ 73 ఏళ్ల వృద్ధురాలు అయి ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకుంటుందా? పైగా దానికో ప్రకటన కూడానా? అనుకునేవారు ఒకటి గనమించాలి. 100 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోవటానికి ఎంతోమంది మగవారు తెగ ఉబలాటపడిపోతుంటారు. అటువంటివారిని పెళ్లి చేసుకుంటావా? అని అడిగితే ఈ వయస్సులో నాకు పెళ్లేంటీ? అని ఎంత మాత్రం అనరు..పైగా ‘‘నాకు పిల్లనెవరు ఇస్తారూ?’’అంటారు.అంటే పిల్లనిచ్చేవాళ్లుంటే పెళ్లి చేసేసుకుందామనే ఆశ 100 ఉన్నాగానీ..మరి అటువంటప్పుడు 73ఏళ్ల ఆమె పెళ్లి ప్రకటన ఇస్తే తప్పేంటి? అనేది గమనించాలి? ఇంతకీ ఈ 73 ఏళ్లామె పెళ్లి ప్రకటనకు మంచి మద్దతు కూడా లభించటం ఆహ్వానించాల్సిన విషయం. పైగా యువత నుంచి ఈ బామ్మగారిని మంచి సపోర్ట్ లభిస్తోంది. ఈ వివాహ ప్రకటన కర్ణాటకలో మ్యాట్రిమోనియల్ వచ్చిన ఈ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది..

India

ఈ వివాహ ప్రకట గురించి వివరాలేమంటే..కర్ణాటకలోని మైసూరుకు చెందిన 73 ఏళ్ళ వృద్ధురాలు టీచర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. గతంలో వివాహం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారావిడ. ఆ తరువాత ఉద్యోగం నుంచి రిలైర్డ్ కూడా అయ్యారు. తల్లిదండ్రులు కూడా చనిపోయారు.దీంతో ఆమె ఒంటిరి అయిపోయారు. దీంతో ఇప్పుడామెకు ఓ తోడు కావాలని అనుకుంటున్నారు.

ఈ ప్రకటన గురించి ఆమె మాట్లాడుతూ..‘‘నాకు సొంత కుటుంబం లేదు. నా తల్లిదండ్రులు లేరు. నా తొలి వివాహం విడాకులతో ముగిసింది. నేను ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నాను. ఇంట్లో పడిపోతే సాయం చేసేవారు ఉండరనే ఆలోచన వస్తోంది. బస్టాప్ నుంచి ఇంటికి నడవాలంటే భయమేస్తోంది. ఇలాంటి ఆలోచనలు జీవిత భాగస్వామి కోసం ఎదురు చూసేలా చేస్తున్నాయి’’ అని ఆ బామ్మగారు మీడియాకు తెలిపారు. తన శేష జీవితమంతా తనతో కలిసి ఉండే ఓ తోడుతో సంతోషంగా గడపాలని అనుకుంటున్నానని తెలిపారు. కష్టం..సుఖం పంచుకోవటానికి..మనస్సు విప్పి మాట్లాడటానికి ఓ తోడు కావాలి అని కోరుకుంటున్నారు.

ఆమె ఇచ్చిన ప్రకటనలో ఇలా ఉంది..నాకో వరుడు కావాలి. ఆరోగ్యవంతుడు, తన కన్నా పెద్ద వయసుగల వ్యక్తి కావాలి. అటువంటి వ్యక్తి తప్పనిసరిగా బ్రాహ్మణుడే అయి ఉండాలని ఆమె స్పష్టంచేశారు. తాను కూడా బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తినని..అందుకే బ్రాహ్మణ వరుడే కావాలని కోరుతున్నారు. కొంత కాలం నుంచి తాను ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నానని చెప్పారు. తన మొదటి పెళ్లి అత్యంత బాధాకరంగా విడాకులతో ముగిసిందన్నారు. ఆ తర్వాత తాను పునర్వివాహం చేసుకోలేదని అస్సలు ఆ ఆలోచనే తనకు రాలేదనీ..కానీ అందరినీ కోల్పోయి ఒంటిరి అయ్యాక..తోడు కావాలనిఅనిపిస్తోందని తెలిపారు. ప్రస్తుతం బస్టాప్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలంటే భయంగా ఉందని, ఒంటరిగా జీవించడం కష్టంగా ఉందని, అందుకే సంబంధం కోసం చూస్తున్నానని తెలిపారు.