Karnataka : ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు 50 శాతం సీట్ల కేటాయింపు .. సిద్దూ సర్కార్ వినూత్న నిర్ణయం

పురుషులు మాక్కూడా మంచి రోజులొచ్చాయి అనేలా ఆర్టీసీ బస్సుల్లో పురుషుల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించింది ప్రభుత్వం. మహిళలకు ఉచితంగా ప్రయాణం ప్రకటించిన సిద్ధయ్య సర్కారు మరి షురుషులకు కూడా సీట్లు కేటాయించి వినూత్న నిర్ణయం తీసుకుంది.

Karnataka : ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు 50 శాతం సీట్ల కేటాయింపు .. సిద్దూ సర్కార్ వినూత్న నిర్ణయం

Karnataka RTC buses Mens seats reservation

Karnataka RTC buses Mens seats reservation  : ఆర్టీసీ బస్సులో మహిళల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించి ఉంటాయనే విషయం తెలిసిందే. ఆడవాళ్లకు కేటాయించిన సీట్ల వెనుక ‘స్త్రీలను గౌరవిద్దాం.. స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం’ అని రాసి ఉండటం చూశాం. కానీ పురుషుల కోసం సీట్లు ఉండటం ఎక్కడా చూసి ఉండం. కానీ తాజాగా ఆర్టీసీ బస్సులో పురుషుల కోసం ప్రత్యేకించి సీట్లు కేటాయించింది కర్ణాటక ప్రభుత్వం. అదేంటీ పురుషుల కోసం ప్రత్యేకమైన సీట్ల కేటాయింపా?అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే… కర్ణాటక ప్రభుత్వం ఈ  వినూత్న నిర్ణయం తీసుకుంది..

 

దీంతో పురుషులు మాక్కూడా మంచి రోజులొచ్చాయి అనేలా ఉంది ఈ కేటాయింపు. కర్ణాటక ప్రభుత్వం నడిపే ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు 50 శాతం సీట్లు కేటాయించింది. ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో భాగంగా ‘శక్తి పథకం’ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం అని ప్రకటించింది. మరి పురుషులకో..? అనే ప్రశ్న వస్తుంది. మహిళలే కాదు మేం కూడా ఓట్లు వేశాంగా మాకోసం ఏంటి అని అనుకునే పురుషులకు కన్నడ ప్రభుత్వ ఈ కేటాయింపులు చేసిందా?అన్నట్లుగా ఉంది. ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు 50శాతం సీట్ల కేటాయింపు అనేది ఆసక్తికరంగా మారింది.

 

మహిళలకు ఉచిత ప్రయాణం..పురుషులకు బస్సుల్లో 50 శాతం సీట్లను కేటాయిస్తున్నామని రవాణా అధికారులు స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ విషయంలో ప్రభుత్వం ఏసీ, లగ్జరీ బస్సులను మాత్రం దీని నుంచి మినహాయించింది. కానీ మహిళలకు ఉచిత ప్రయాణం ప్రకటనతో ఆర్టీసీకి మాత్రం నష్టాలు రావటం జరుగుతుంది. దీంతో మగాళ్లు డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుగోలు చేస్తు్న్నారు కాబట్టి.. బస్సుల్లో 50 శాతం సీట్లను పురుషులకు కేటాయిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

 

సాధారణంగా ఆర్టీసీ బస్సుల సీట్ల వెనుక ‘ స్త్రీలకు మాత్రమే’అని రాసి ఉంటుంది. మరి కన్నడ ప్రభుత్వం ఇక వారి బస్సుల్లో ‘పురుషులకు కేటాయించిన సీట్లు’ అని రాస్తారట. బస్సులో పురుషులు లేకుంటే.. ఆ సీట్లు ఖాళీగా ఉంటే మహిళలు కూర్చోవచ్చు. కానీ ఒకవేళ పురుషులు వస్తే మాత్రం ఆ సీటును ఖాళీ చేసి వారిని కూర్చోనివ్వాలి. ఎందుకంటే మహిళలకు ఉచితం కదా..మరి డబ్బులిచ్చి ప్రయాణించేవారు నిలబడి ప్రయాణించటం బాగుండదు కదా..అటు మహిళలకు ఉచితం…ఇటు పురుషులకు ‘సీట్లు ప్రత్యేకం’తో లెవెల్ అయిపోయిందనేలా కన్నడ ప్రభుత్వం భావించినట్లుగా ఉంది.