Karnataka Express : రైలు ఇంజన్‌కు వేలాడుతూ యువతీ యువకులు మృతదేహాలు..

వేగంగా దూసుకెళుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్..సడెన్ గా ఆగిపోయింది. ఏంటాని చూస్తే రైలు ఇంజన్ కు వేళాడుతు రెండు మృతదేహాలు..

Karnataka Express : రైలు ఇంజన్‌కు వేలాడుతూ యువతీ యువకులు మృతదేహాలు..

Karnataka Express

Karnataka Express train henged two dead bodyes : అది కర్ణాటక సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ రైలు..ఢిల్లీ నుంచి ముంబైకు దూసుకుపోతోంది. అలా 20 కిలోమీటర్లు ప్రయాణించింది. బుర్హాన్‌పూర్ కూడా దాటింది. రైలు పాస్టుగా దూసుకెళుతోంది. అలా వెళ్లే రైలు సడెన్ గా ఆగింది. ఎందుకు ఆగిందో ప్రయాణీకులకు అర్థం కాలేదు. ఎక్కడపడితే అక్కడే ఆపేస్తారేంటీ అనుకుంటూ అసహనం వ్యక్తంచేశారు. కాసేపటికి బయలుదేరుతుంది కదా అని అనుకున్నారు. కానీ చాలాసేపు అయ్యిందికానీ ఎంతకూ బయలుదేరకపోవటంతో విసుగు చెందిన ప్రయాణీకులు కొంతమంది రైలు దిగారు. ఏం జరిగిందా?అని తెలుసుకోవాటానికి ఒక్కొక్కరుగా ఇంజన్ వద్దకు వచ్చారు. అంతే షాక్ అయ్యారు? చాలామంది భయపడిపోయారు. కారణం రైలు ఇంజన్ కు రెండు మృతదేహాలు వేలాడుతు కనిపించాయి. వారిద్దరు యువతీ యువకులు అని తెలుస్తోంది. ప్రేమ జంట అయి ఉండవచ్చనీ..వారిద్దరు ఆత్మహత్య చేసుకున్నారని అనుమానాలు కలిగాయి.

Read more : Minor Rape : ముంబైలో మరో దారుణం.. రైల్వే స్టేషన్‌లో బాలికపై అత్యాచారం

కాగా రైలు స్పీడుగా వెళుతుండగా లోకో పైలట్ (ట్రెయిన్ డ్రైవర్) కు రాళ్ల ఎగిరిపడుతున్న శబ్ధం వినిపించది. రైలు వెళుతుంటే కొంతమంది ఆకతాయిలు రాళ్లు విసురుతుంటారు. అవేమో అనుకున్నాడు మొదట. కానీ శబ్ధం వింతగా వస్తుండేసరికిగా ఏదో అని అనుమానం కలిగింది. ఆ శబ్ధం కంటిన్యూగా వస్తుండేసరికి అనుమానం మరింత పెరిగి రైలును .రైలు సాత్‌ఫటా సమీపంలోని డోంగర్ గావ్ స్టేషన్ వద్ద రైలు ఆపి ఇంజన్ వద్దకు వచ్చి చూసేసరికి ఇంజన్ కు వేలాడుతూ యువతీ యువకుల శవాలు కనిపించాయి. అంతే షాక్ అయ్యాడు.

Read more : Bhubaneswar : అందమైన అమ్మాయిలు ఫొటోలు పెడుతుంది..ఛాటింగ్ చేస్తుంది, తర్వాత…

వెంటనే లోకో పైలట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అలా అధికారులు వచ్చి పరిస్థితి సమీక్షించి తగిన చర్యలు తీసుకున్నారు. అలా అక్కడే రైలు దాదాపు రెండు గంటలపాటు నిలిచిపోవాల్సి వచ్చింది. దీంతో ప్రయాణీకులు పలు ఇబ్బందులకు గురయ్యారు.కాగా..యువతీయువకులిద్దరూ ప్రేమికులై ఉండొచ్చని, ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే..వీరు రైలు కిందపడటం లోకో పైలట్ కూడా చూడలేదని సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కాగా మృతుల గురించి సమాచారం కోసం యత్నిస్తున్నామని ఖ్వాండా జీఆర్పీ స్టేషన్ ఇన్ చార్జ్ బబిత తెలిపారు.