Karnataka ULB Election Results : కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి బిగ్ షాక్..ఇది ట్రైలర్ మాత్రమేనన్న కాంగ్రెస్

  డిసెంబర్-27న కర్ణాటకలోని 58 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఐదు సిటీ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 167 వార్డులు, 19 పట్టణ మున్సిపల్ కౌన్సిల్స్

Karnataka ULB Election Results : కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి బిగ్ షాక్..ఇది ట్రైలర్ మాత్రమేనన్న కాంగ్రెస్

Karnataka

Karnataka ULB Election Results :  డిసెంబర్-27న కర్ణాటకలోని 58 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఐదు సిటీ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 167 వార్డులు, 19 పట్టణ మున్సిపల్ కౌన్సిల్స్ పరిధిలోని 441వార్డులు, 34 పట్టణ పంచాయతీల పరిధిలో 577 వార్డులు కలుపుకుని మొత్తంగా 1184 వార్డులకు డిసెంబర్ 27న జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి.

ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అధికార బీజేపీకిొ గట్టి షాక్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. మొత్తం 58 మున్సిపాలిటీల పరిధిలోని 1184 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. 498 వార్డుల్లో కాంగ్రెస్,437 వార్డుల్లో బీజేపీ,45 వార్డుల్లో జేడీఎస్,ఇతరులు 204 వార్డుల్లో విజయం సాధించారు. సీట్లు మాత్రమే కాకుండా ఓట్ల శాతంలో కూడా కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. 42.06 శాతం ఓట్లను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోగా.. బీజేపీ 36.90 శాతం ఓట్లు,జేడీఎస్ 3.8శాతం ఓట్లు,ఇతరులు 17.22శాతం ఓట్లు సాధించారు.

అయితే, నగర మున్సిపాలిటీల్లో మాత్రం బీజేపీ సత్తా చాటింది. 166 నగర మున్సిపాలిటీల్లో.. కాంగ్రెస్ పార్టీ 61 వార్డులు గెలుచుకోగా బీజేపీ 67,జేడీఎస్ 12,ఇతరులు 26 వార్డుల్లో విజయం సాధించారు. 441 టౌన్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ …కాంగ్రెస్‌ 201, బీజేపీ 176, జేడీఎస్‌ 21 వార్డుల్లో విజయం సాధించింది. పట్టణ పంచాయతీల్లోని 588 వార్డుల్లో.. కాంగ్రెస్‌ 236, బీజేపీ 194, జేడీఎస్‌ 12, ఇతరులు 135 వార్డుల్లో గెలుపొందారు.

ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ పలితాలు కేవలం ట్రైలర్ మాత్రేమేనని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. కార్యకర్తలకు, గెలిచిన అభ్యర్థులకు కాంగ్రెస్ అభినందనలు తెలిపింది. కాంగ్రెస్‌ పై ప్రజలు నమ్మకముంచారని, ఓటర్లకు ధన్యవాదాలు చెబుతున్నట్లు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తెలిపారు.

ALSO READ Covid Cases In Mumbai : ముంబైపై కోవిడ్ పంజా..ఒక్కరోజే దాదాపు 4వేల కేసులు