కరోనా బాధితుల్ని తీసుకెళ్లేందుకు వచ్చిన వైద్యసిబ్బంది..పోలీసులపై రాళ్ల దాడి

  • Published By: nagamani ,Published On : June 16, 2020 / 06:39 AM IST
కరోనా బాధితుల్ని తీసుకెళ్లేందుకు వచ్చిన వైద్యసిబ్బంది..పోలీసులపై రాళ్ల దాడి

కర్ణాటక రాష్ట్రంలోని  గ్రామంలోని ఓ తండాలో  కొంతమందికి కరోనా సోకిందనే విషయం తెలుసుకున్న వైద్యసిబ్బంది  వారిని తీసుకెళ్లటానికి గ్రామానికి వచ్చిన వైద్య సిబ్బందిపై గ్రామస్థులు రాళ్లదాడికి పాల్పడ్డారు.కమలాపురా సమీపంలోని మరమంచి గ్రామంలోని తండాలో ఈ ఘటన జరిగింది. తండాలో 15మందికి కరోనా సోకిందని వైద్యసిబ్బంది..ఆశావర్కర్లు..పోలీసులు అంబులెన్స్ తీసుకుని ఆ తండాకు వచ్చారు. దీంతో ఎవ్వరూ మా ఊరు రావద్దు..మావాళ్లను తీసుకెళ్లద్దు..మాకెవ్వరికీ కరోరా రాలేదు అంటూ తండావాసులు వైద్యసిబ్బంది..ఆశావర్కర్లపై రాళ్లదాడి చేశారు.

ముంబై నుంచి తండాకు వచ్చినవారికి కరోనా ఉందని తెలిసి వారిని గుర్తించేందుకు తండాకు అంబులెన్స్ తోసహావచ్చారు. ముంబైనుంచి వచ్చినవారికి వైరస్ పాజిటివ్ గా వచ్చిందని తమకు సమాచారం అందించదనీ..వారంతా హాస్పిటల్ కు రావాల్సిందేననీ..వారికి మరోసారి పరీక్షలు చేసి నెగిటివ్ వస్తే..వారిని క్వారంటైన్ లో కొన్ని రోజులు ఉంచి పంపిచేస్తామని నచ్చజెప్పారు. కానీ తండావాలసులు మాలో ఎవ్వరూ కరోనా రాలేదు..దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి..మా వాళ్లను క్వారంటైన్ కు తీసుకెళ్లటానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. 

కానీ వైద్యసిబ్బంది. ఆశావర్కర్లు..పోలీసులు వారికి నచ్చచెప్పటానికి ఎంతగానో యత్నించారు. కానీ వాళ్లు వినలేదు. దీంతో పోలీసులు కొంతమందిని ప్రశ్నించటంతోతండా వాసులంతా వైద్యసిబ్బంది..ఆశావర్కర్లపై రాళ్లదాడి చేశారు.ఈ దాడిలో కొంతమందికి గాయాలయ్యాయి. పోలీసులు వాహనాలు..అంబులెన్స్ లను ధ్వంసం అయ్యాయి. దీంతో పోలీసులకు..గ్రామస్తులకు వాగ్వాదం జరగటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

దీంతో చేసేదేమీ లేక పోలీసులు అక్కడ జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయటంతో సీఐ రాఘవేంద్రభజంత్రి, తహసీల్దార్ అంజుమ్ తబుసుమ్ లు తండాకు వచ్చి గ్రామస్తులకు నచ్చచెప్పటంతో పరిస్థితి చక్కబడింది. ఈ విషయాన్ని కాలాబురాగి పోలీసు సూపరింటెండెంట్ ఇడా మార్టిన్ మార్బానియాంగ్ దృవీకరంచారు. గ్రామస్తులు పోలీసులు..వైద్యసిబ్బందిపై రాళ్లదాడిచేశారని తెలిపారు. కానీ గ్రామస్తులు మాత్రం పోలీసులే మాపై దాడిచేశారని చెప్పటం గమనించాల్సిన విషయం.