INX Media case: మనీలాండరింగ్ కేసులో కార్తీ చిదంబరం సహా పలువురి నుంచి రూ.11.04 కోట్లు సీజ్

INX Media case: చిదంబరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా(INX Media)లో విదేశీ పెట్టుబడులను స్వీకరించడంలో మనీలాండరింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి.

INX Media case: మనీలాండరింగ్ కేసులో కార్తీ చిదంబరం సహా పలువురి నుంచి రూ.11.04 కోట్లు సీజ్

Karti Chidambaram

INX Media case: ఐఎన్ఎక్స్ మీడియా కేసు(INX Media case)లో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సహా పలువురి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) రూ.11.04 కోట్లు సీజ్ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసు(INX Media case)లో మనీలాండరింగ్ పై ఈడీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కర్ణాటకలోని కోడగు జిల్లాలో సీజ్ చేసిన ఓ ఆస్తితో కలిపి రూ.11.04 కోట్లు సీజ్ చేసినట్లు ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది.

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం తమిళనాడులోని శివగంగా నుంచి ఎంపీగా ఉన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చిదంబరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా(INX Media)లో విదేశీ పెట్టుబడులను స్వీకరించడంలో మనీలాండరింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి.

దీనిపైనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) విచారణ జరుపుతోంది. అక్రమాలు జరిగాయని విచారణలో భాగంగా తెలిసిందని ఈడీ పేర్కొంది. అయితే, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తమ కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కార్తీ చిదంబరం అంటున్నారు.

ఐఎన్ఎక్స్ మీడియా కేసు(INX Media case)లో చిదంబరాన్ని 2019 ఆగస్టులో సీబీఐ అరెస్టు చేసింది. అదే ఏడాది అక్టోబరులో ఈడీ కూడా మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసింది. అనంతరం, ఆ రెండు కేసుల్లో చిదంబరానికి బెయిల్ వచ్చింది. 2017 మేలో సీబీఐ కేసు నమోదు చేసింది.

Chhattisgarh: కాంగ్రెస్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై మావోయిస్టుల కాల్పులు