Temple vs Masjid Case : వివాదానికి తెర..కాశీ విశ్వనాథ ఆలయానికి స్థలం అప్పగించిన ముస్లింలు

కాశీ విశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు కేసులో మతసామరస్యం వెల్లి విరిసింది.

Temple vs Masjid Case : వివాదానికి తెర..కాశీ విశ్వనాథ ఆలయానికి స్థలం అప్పగించిన ముస్లింలు

Kashi

Kashi Vishwanath Temple vs Gyanvapi Masjid Case  కాశీ విశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు కేసులో మతసామరస్యం వెల్లి విరిసింది. కాశీ విశ్వనాథ కారిడార్ కోసం 1700 చదరపు అడుగుల స్థలాన్ని ముస్లిం పెద్దలు కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టుకు అప్పగించారు. అయితే ఇందుకు ప్రతిగా.. జ్ఞానవాపి మసీదు మరియు కాశీ విశ్వనాథ ఆలయానికి దూరంగా ఉన్న 1000 చదరపు అడుగుల స్థలాన్ని ముస్లింలకు ఆలయ పాలకవర్గం ఇచ్చింది.

ఈ విషయమై అంజుమన్ ఇంతజమియా మసీదు సంయుక్త కార్యదర్శి వాసిన్ మాట్లాడుతూ…కేసు ఇప్పటికీ కోర్టులో ఉంది. ప్రభుత్వం కారిడార్ నిర్మాణం జరుపుతోంది. వాళ్లు స్థలం స్వాధీనం చేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని మా వాళ్లతో చర్చించాం. కాశీ విశ్వనాథ కారిడార్ కోసం 1700 చదరపు అడుగుల స్థలాన్ని అప్పగించేందుకు మసీదు బోర్డు అంగీకరించిందని తెలిపారు.

కాగా, కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోని మసీదు ప్రాంతంలో సర్వే జరిపేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఈ ఏడాది ప్రారంభంలో వారణాసి కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. మందిరం-మసీదు వివాదంపై విచారణ జరుపుతున్న కోర్టు.. ఐదుగురు ఆర్కియాలజికల్ నిపుణులతో కమిటీ ఏర్పాటుకు కూడా ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను జ్ఞానవాపి మసీదు మేనేజిమెంట్ కమిటీ హైకోర్టులో సవాలు చేసింది. కాశీ విశ్వనాథ ఆలయాన్ని మొగల్ చక్రవర్తి ఔరంగజేబు కూల్చివేశాడని, అనంతరం 1669లో జ్ఞానవాపి మసీదు నిర్మాణం జరిగిందని ఆలయం తరఫున పిటిషన్ వేసిన విజయ్ శంకర్ రస్తోగి వాదిస్తున్నారు. మసీదు నిర్మించిన స్థలం హిందువులకు చెందినదని ఆయన తన పిటిషన్‌లో తెలిపారు.