కాశీ విశ్వనాథ ఆలయంలో కొత్త డ్రెస్ కోడ్

  • Published By: venkaiahnaidu ,Published On : January 13, 2020 / 12:51 PM IST
కాశీ విశ్వనాథ ఆలయంలో కొత్త డ్రెస్ కోడ్

వారణాశిలోని ప్రముఖ కాశీ విశ్వనాథ్ ఆలయంలో కొత్త రూల్ అమలులోకి రానుంది. ఇకపై కాశీ విశ్వనాథ ఆలయంలో స్పార్ష్ దర్శన్ కి(జ్యోతిర్లింగాన్ని తాకి ప్రార్థించడం) డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని ఆలయ యంత్రాంగం చెబుతోంది. త్వరలోనే ఈ డ్రెస్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. హిందూ సాంప్ర‌దాయ దుస్తుల్లో వ‌స్తేనే.. భ‌క్తుల‌ను ఆల‌య గ‌ర్భ‌గుడిలోకి ప్ర‌వేశం క‌ల్పించ‌నున్నారు. ధోతీ కుర్తాతో వ‌చ్చే మ‌గ‌వారికి, చీర క‌ట్టుకునివ‌చ్చే ఆడ‌వాళ్ల‌కు మాత్ర‌మే విశ్వ‌నాథుడి గ‌ర్భ‌గుడిలోకి ప్ర‌వేశం క‌ల్పించ‌నున్నారు.

కాశీ విద్వ‌త్ ప‌రిష‌ద్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. త్వ‌ర‌లోనే ఈ నియ‌మాన్ని అమ‌లు చేయ‌నున్నారు. ప్యాంట్లు, ష‌ర్ట్‌లు, జీన్స్ ధ‌రించే వారిని ప్ర‌ధాన ఆల‌యంలోకి అనుమ‌తించరు. వారు కొంత దూరం నుంచి మాత్ర‌మే దైవ ద‌ర్శ‌నం చేసుకోవాలి. సంప్రదాయ దుస్తుల్లో రాని భక్తులను జ్యోతిర్లింగం స్పర్శదర్శనానికి అనుమతించమని, దూరం నుంచే దర్శించుకోవాలని ఆలయ యంత్రాంగం తెలిపింది. కొత్త డ్రెస్ కోడ్‌ను అమ‌లు చేసే తేదీని అతి త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నట్లు తెలిపారు. గర్భగుడిలోకి ప్రవేశించడానికి భక్తులకు ఉదయం 11 గంటల వరకే అనుమతించాలని నిర్ణయించారు.

వందలఏళ్ల నాటి నుంచి స్పార్ష్ దర్శనం అములులో ఉంది. అయితే 2019శ్రావణమాసంలోని రద్దీ కారణంగా దానిని ఆపేశారు. శ్రావణమాసం ముగిసిన తర్వాత ఆ దర్శనాన్ని పునరుద్దరించేందుకు ఆలయ యంత్రాగం నిరాకరించింది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రెండు-మూడు గంటలకు మాత్రమే ప్రారంభించబడినప్పటికీ భక్తుల ఆగ్రహం చివరికి ఆలయ అధికారులతో ఆ దర్శనాన్ని పునప్రారంభించాల్సి వచ్చింది. భారీగా రద్దీ ఉన్న సమయంలో స్పార్ష్ దర్శనం అసాధ్యమవుతుండటాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తుల మనోభావాలను దృష్యా ఆలయ అధికారులు దీనికి ఒక శాశాత్వ పరిష్కార విధానాలను వెతుకుతున్నారు.