చపాతీతో సమాచారం : కూతురితో టిఫిన్ బాక్సు ద్వారా మాట్లాడుతున్న మహబూబా ముఫ్తీ   

  • Published By: veegamteam ,Published On : February 8, 2020 / 10:14 AM IST
చపాతీతో సమాచారం : కూతురితో టిఫిన్ బాక్సు ద్వారా మాట్లాడుతున్న మహబూబా ముఫ్తీ   

కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ‘‘ఆర్టికల్‌ 370 రద్దు’’ చేసిన తరువాత కశ్మీర్ లో ప్రాథమిక హక్కులను కూడా కోల్పోయారు కశ్మీర్ ప్రజలు. దీనికి కశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ కుటుంబ కూడా అతీతం కాదు. వారికూడా ప్రాథమిక హక్కులను కోల్పోయారు. ‘‘ఆర్టికల్‌ 370 రద్దు’’ను వ్యతిరేకించిన ప్రతీ వారి పరిస్థితి అదే.‘‘ఆర్టికల్‌ 370 రద్దు జరిగిన నాటి నుంచి గత ఆరు నెలలుగా మహబూబా ముఫ్తీ గృహనిర్భంధంలో ఉన్న విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో మహబూబా ముఫ్తీ తన కుమార్తెతో ఎలా మాట్లాడిన విధానం గురించి తెలిస్తే కశ్మీర్ పరిస్ధితుల గురించి అర్థం చేసుకోవచ్చు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్రం రద్దు చేసిన నాటి  నుంచి అంటే 2019, ఆగస్ట్‌ 5 నుంచి మెహబూబా ముఫ్తి సహా మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారిని సొంత నివాసాలకు తరలిస్తున్నట్లు అధికారులు ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే వారిద్దరిపై అత్యంత కఠినమైన ప్రజా భద్రత చట్టం(పబ్లిక్‌ సేఫ్టీ యాక్ట్‌-పీఎస్‌ఏ) కింద కేసు నమోదు చేశారు. 

దీనిపై మెహబూబా ముఫ్తి కుమార్తె ఇల్తిజా ప్రస్తుత పరిణామాలపై ముఫ్తి ట్విటర్‌ అకౌంట్‌లో ఓ లేఖ పోస్టు చేశారు. ఆ పోస్ట్ సారాంశం ఇలా ఉంది…‘‘ఆర్టికల్‌ 370 రద్దు జరిగిన నాటి నుంచి గత ఆరు నెలలుగా మా అమ్మ గృహ నిర్బంధంలో ఉన్నారు. అమ్మను అరెస్టు చేసి జైలుకు తీసుకువెళ్లిన రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. గృహ నిర్బంధం జరిగిన రోజు నుంచి అమ్మను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎంతగానో ఎదురు చూశాను. 

అలా..ఓ రోజు టిఫిన్‌ బా​క్సులో ఉన్న ఓ లెటర్ ను చూసి ఆశ్చర్యపోయాను. నా కోసం మా అమ్మ టిఫిన్ బాక్సులో…పంపిన లెటర్ లో ‘‘నా సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా మెసేజ్ కు పోస్టు చేసిన వారిని కూడా అరెస్టు చేస్తారు. లవ్‌ యూ మిస్‌ యూ’’ అనే ఉత్తరం కనిపించింది. అదిచూసిన నాకు అమ్మకు రిప్లై ఇవ్వాలని అనిపించింది. కానీ ఎలా ఇవ్వాలో అర్థం కాలేదు. అప్పుడే మా  గ్రానీ ఒక ఐడియా ఇచ్చారు. దాంతో ఓ లెటర్‌ రాసి.. దానిని చిన్నగా మడత పెట్టి..చపాతీలో చుట్టి..పెట్టాను అని తెలిపారు.  

ఇలా నేను ఒక్కదాన్నే కాదు ఎంతో మంది తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కోల్పోయారు. అంతేకాదు జమ్మూ కశ్మీర్‌ ఆర్థికంగా ఎంతగానో నష్టపోయింది. అంతేకాదు ఇవేకాదు..కేంద్ర తీసుకునే పలు ప్రజావ్యతిరేక నిర్ణయాలతో దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇవేవీ ప్రభుత్వానికి అవసరంలేదు. ప్రజల గురించి పట్టించుకోదు. తన ఇష్టానుసారం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని..నియంతలా వ్యవహరిస్తోంది. 

పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్య తీర్పు వంటివి ఇలాంటి కష్టాలను మరింతగా పెంచుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ప్రజల ఇబ్బందులు పడటం చూసి ఎంజాయ్‌ చేస్తోంది. ఒక కూతురిగా మా అమ్మను భద్రతా బలగాలు బంధించడం నేను కళ్లారా చూశాను. ఆమెను విముక్తురాలిని చేసేందుకు చిన్నపాటి యుద్ధమే చేశాను. ఇక బతుకు పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని అని ఇల్తిజా తన లేఖలో పేర్కొన్నారు.  

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించే వారిని..ప్రశ్నించేవారిని ‘దేశ వ్యతిరేకులు’..దేశ ద్రోహుల కింద ముద్రవేస్తున్నారనీ..అటువంటివారంతా తుక్డే-తుక్డే గ్యాంగ్ లని అపహాస్యం చేస్తున్నారని తెలిపారు ఇల్తిజా.