కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారం..తాలిబన్ సంస్థ

  • Published By: venkaiahnaidu ,Published On : May 18, 2020 / 04:27 PM IST
కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారం..తాలిబన్ సంస్థ

కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ తో తాలిబన్ సంస్థ పనిచేసే అవకాశముందని,కశ్మీర్ విషయం పరిష్కారం కాకపోతే భారత్ తో స్సేహితులుగా కొనసాగడం అసాధ్యమని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా యుజాహిద్ చెప్పినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తాలిబన్ సంస్థ స్పందించింది.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తాలిబన్ సృష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన తాలిబన్…కశ్మీర్ భారత అంతర్భాగ విషయమని,ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది. 

కశ్మీర్ లోని జిహాద్ లో తాము చేరుతున్నట్లు మీడియాలో వస్తున్నది తప్పు అని తాలిబన్ పొలిటికల్ వింగ్ గా తమకు తాము ప్రకటించుకున్న ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్గనిస్తాన్ ప్రతినిధి సుహెయిల్ షాహీన్ సోమవారం(మే-18,2020)సాయంత్రం ఓ ట్వీట్ లో తెలిపారు. మరోవైపు భారత్ కూడా సోషల్ మీడియాలో వస్తున్న పోస్ట్ లు ఫేక్ అని,తాలిబన్ పొజిషన్ ను ప్రతిబింబించడం లేదని భారత్ తెలిపింది.