పార్లమెంట్ భవనం వద్ద అనుమానితుడు..గుర్తు తెలియని భాషలో ఉన్న లేఖ స్వాధీనం

  • Published By: madhu ,Published On : August 26, 2020 / 03:06 PM IST
పార్లమెంట్ భవనం వద్ద అనుమానితుడు..గుర్తు తెలియని భాషలో ఉన్న లేఖ స్వాధీనం

కొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో పార్లమెంట్ భవనం ఎదుట అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని సెంట్రల్ రిజర్వ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ఇతను బడ్గామ్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.



గుర్తు తెలియని సమాచారంతో రాసి ఉన్న లేఖ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఆధార్ కార్డు ఒక పేరు, డ్రైవింగ్ లైసెన్స్ లో మరో పేరు ఉందని పోలీసులు వెల్లడించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీసులు..ఈ వ్యక్తిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.
https://10tv.in/unhappy-over-pay-cut-man-kills-employer-throws-body-in-welldellhi/
కరోనా వైరస్ విస్తరిసుండగా విధించిన లాక్ డౌన్ సమయంలో 2016లో ఢిల్లీకి వచ్చానని సీఆర్పీఎఫ్ అధికారులకు వెల్లడించాడు. మొదట జామియా ప్రాంతంలో, తర్వాత నిజాముద్దీన్ జామా మసీదు వద్దనున్నట్లు తెలిపాడు.



ఇటీవలే యూసఫ్ అనే ఉగ్రవాదిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం సెప్టెంబర్ లో కత్తితో పార్లమెంట్ లో ప్రవేశించడానికి ప్రయత్నించిన 25 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు.