KCR in Bihar: లాలూ ప్రసాద్ యాదవ్‭తో సమావేశమైన కేసీఆర్

బుధవారం బేగంపేట విమానాశ్రయం నుంచి పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్.. నేరుగా బీహార్ సీఎం నితీశ్ కార్యాలయానికి వెళ్లారు. కేసీఆర్‌కు బీహార్ సీఎం నితీశ్ కుమార్‭తో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజశ్వీ యాదవ్‭ ఘన స్వాగతం పలికారు

KCR in Bihar: లాలూ ప్రసాద్ యాదవ్‭తో సమావేశమైన కేసీఆర్

KCR meets Lalu prasad at his residence in patna

KCR in Bihar: బిహార్ రాజకీయాల్లో సీనియర్ నేత, రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‭ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం కలుసుకున్నారు. బిహార్ పర్యటనలో ఉన్న కేసీఆర్.. పాట్నాలోని లాలూ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీసి పరామర్శించారు. దీనికి ముందు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‭ను కలుసుకున్న కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై చర్చించారు. లాలూతో సైతం జాతీయ రాజకీయాల అంశంపై కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.

బుధవారం బేగంపేట విమానాశ్రయం నుంచి పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్.. నేరుగా బీహార్ సీఎం నితీశ్ కార్యాలయానికి వెళ్లారు. కేసీఆర్‌కు బీహార్ సీఎం నితీశ్ కుమార్‭తో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజశ్వీ యాదవ్‭ ఘన స్వాగతం పలికారు. కాసేపు నితీశ్, తేజశ్వీ యాదవ్‭తో భేటీ అయిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరపున సైనికుల కుటుంబాలకు నితీశ్‭తో కలిసి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి వేల మంది బీహారీలు కృషి చేస్తున్నారని అన్నారు. గాల్వాన్‭లో వీర సైనికుల త్యాగం ఎంతో గొప్పదని, అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని కేసీఆర్ అన్నారు.

ఇదే పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ‘‘ఏ ప్రధాని హయాంలో కూడా రూపాయి విలువ ఇంతగా పడిపోలేదు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. న్యాయం కోసం రైతులు ఐదు నెలలు ఆందోళన చేయాలా? ఖర్చులు పెరిగిపోయాయి. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు… కానీ, ఖర్చులు డబుల్ అయ్యాయి. దేశంలో పరిస్థితులు ఘోరంగా మారుతున్నాయి. సామాన్యులు, రైతులు అంతా ఆందోళనలో ఉన్నారు’’ అని కేసీఆర్ అన్నారు.

Muslims and Hindus: వెల్లివిరిసిన మత సామరస్యం.. వినాయక చవితి వేడుకల్లో ముస్లింలు