Kedarnath : కేదార్‌నాథ్‌కు ప్రధాని మోదీ.. ప్రత్యేక పూజలు!

కేదార్‌నాథ్‌లో నేడు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. కొద్దిసేపటి క్రితమే కేదార్‌నాథ్‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ప్రధాని రాకతో సామాన్య భక్తుల దర్శనం నిలిపివేశారు.

Kedarnath : కేదార్‌నాథ్‌కు ప్రధాని మోదీ.. ప్రత్యేక పూజలు!

Kedarnath Kedarnath Decorated Ahead Of Pm Modi's Visit

Kedarnath : కేదార్‌నాథ్‌లో శుక్రవారం (నవంబర్ 5)న ప్రధాని మోదీ పర్యటించనున్నారు. కొద్దిసేపటి క్రితమే కేదార్‌నాథ్ కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ముందుగా కేదార్‌నాథ్ దేవాలయాన్ని సందర్శించి మోదీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ప్రధాని రాకతో శుక్రవారం సామాన్య భక్తుల దర్శనం నిలిపివేశారు. ఇక ఆలయంలో స్వామి వారికి మహారుద్రాభిషేకం జరిపించనున్నారు మోదీ. 2019 ప్రధాని మోదీ కేదారేశ్వరుని ఆలయాన్ని సందర్శించారు. ఇప్పుడు మరోసారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

కేదారేశ్వరుని దర్శనం తర్వాత ప్రధాని మోదీ సరస్వతీ ఘాట్‌లో ఆది శంకరాచార్య సమాధిని పునఃప్రారంభిచనున్నారు. ఆ తర్వాత విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 2013 ఉత్తరాఖండ్ వరదలతో దెబ్బతిన్న సమాధిని పునర్నిర్మించారు. మైసూరులో తయారుచేయించిన ఆదిశంకరాచార్యుల విగ్రహ పునఃప్రారంభ కార్యక్రమంలో మోదీతో పాటు మధ్యప్రదేశ్‌, జార్ఖండ్, గుజరాత్,యూపీ ముఖ్యమంత్రులు పాల్గొంటారు.


ఆధ్మాత్మిక పర్యటన ముగిసిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. అష్టపతి ఘాట్‌లో 130 కోట్ల రూపాయలతో చేపట్టిన సరస్వతి రిటైనింగ్ వాల్, తీర్థ పురోహిత్‌ సముదాయాలు, గరుడ్ చట్టి బ్రిడ్జ్‌, మందాకినీ రిటైనింగ్ వాల్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

వీటి తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అలాగే ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. దేవాలయాన్ని 8 వందల కిలోల పుష్పాలతో అలకరించారు. దీపావళి సందర్భంగా నిన్న భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.
Read Also : Electric Car : వోక్స్ వ్యాగన్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. 520 కి.మీ రేంజ్!