5T Plan : కరోనా కట్టడికి కేజ్రీ మాస్టర్ ప్లాన్ 

  • Published By: madhu ,Published On : April 7, 2020 / 10:16 AM IST
 5T Plan : కరోనా కట్టడికి కేజ్రీ మాస్టర్ ప్లాన్ 

కరోనాను కట్టడి చేసేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. కానీ ఆ దిక్కుమాలిన వైరస్ మాత్రం చిక్కడం లేదు. రోజు రోజుకు భారతదేశంలో పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. వివిధ రాష్ట్రాలు వైరస్ వ్యాపించకుండా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు కదులుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సైతం కేసుఅు అధికంగానే నమోదవుతున్నాయి. దీంతో సీఎం కేజ్రీవాల్ ఐదు సూత్రాల ప్రణాళిక రూపొందించారు.

2020, ఏప్రిల్ 07వ తేదీ మంగళవారం మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. 1. టెస్టింగ్. 2. ట్రేసింగ్. 3. ట్రీట్‌మెంట్. 4. టీమ్ వర్క్. 5. ట్రాకింగ్ అండ్ మానిటరింగ్. ప్లాన్ ను అప్లై చేస్తామన్నారు. కరోనా కేసులు ఎక్కువవతుండడంతో 12 వేల హోటల్ గదులను అద్దెకు తీసుకుని చికిత్స అందించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

1. ఐదు లక్షల మందికి ర్యాండమ్ గా పరీక్షలు.
2. కరోనా వ్యక్తులున్న వారిని త్వరగా గుర్తించడం. 
3. పాజిటివ్ కేసులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించడం.
4.  కరోనాపై పోరాటం చేసేందుకు ప్రభుత్వ వ్యవస్థల మధ్య సమన్వయం. 
5. మర్కజ్ లో పాల్గొన్న వారిని త్వరగా గుర్తించడం, వీరిని కలిసిన వ్యక్తులను పర్యవేక్షించడం. 

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 525 మంది వైరస్ బారిన పడ్డారు. ఇందులో ఏడుగురు చనిపోయారు. 

See Also | విదేశీ ప్రయాణాలు, ప్రచారాలు తగ్గించుకోండి. మోడీకి సోనియా ఇంకా ఏం సూచనలిచ్చారంటే..