Kejriwal: అందుకే హిండెన్‌బ‌ర్గ్-అదానీ విషయంలో విచారణకు మోదీ నో చెబుతున్నారు: అసెంబ్లీలో కేజ్రీవాల్

ఒకవేళ ఈడీ, సీబీఐ హిండెన్ బర్గ్ నివేదికపై విచారణ జరిపితే మోదీకి నష్టం జరుగుతుందని, అదానీకి కాదని అన్నారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ చేసింది ఏమీ లేదని కేజ్రీవాల్ చెప్పారు.

Kejriwal: అందుకే హిండెన్‌బ‌ర్గ్-అదానీ విషయంలో విచారణకు మోదీ నో చెబుతున్నారు: అసెంబ్లీలో కేజ్రీవాల్

Kejriwal

Kejriwal: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లలో దోచుకున్న దానికంటే బీజేపీ ఏడేళ్లలో దోచుకున్నదే అధికమని ఆరోపించారు. అంతేగాక, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దర్వినియోగం చేస్తోందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అదానీ గ్రూప్ కు భారీగా లాభాలు చేకూరాయని ఆరోపించారు.

హిండెన్ బర్గ్-అదానీ విషయంలో విచారణ జరిపించడానికి కేంద్ర సర్కారు అంగీకరించడం లేదని కేజ్రీవాల్ అన్నారు. విపక్ష పార్టీలు ఎంతగా డిమాండ్ చేస్తున్నప్పటికీ అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని చెప్పారు. ఒకవేళ ఈడీ, సీబీఐ హిండెన్ బర్గ్ నివేదికపై విచారణ జరిపితే మోదీకి నష్టం జరుగుతుందని, అదానీకి కాదని అన్నారు.

దేశ ప్రజలకు ప్రధాని మోదీ చేసింది ఏమీ లేదని కేజ్రీవాల్ చెప్పారు. తన స్నేహితుడు అదానీ పట్ల ఎంతో దయను చూపుతున్నారని విమర్శించారు. కాగా, హిండెన్ బర్గ్-అదానీ విషయంలో విచారణ జరిపించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పార్లమెంటు సమావేశాల్లో ప్రతిరోజు గందరగోళం నెలకొంటోంది.

TSPSC paper leak: రూ.100 కోట్ల మేర దావా… రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసులు