లాక్ డౌన్ సడలింపులు..వాటిపై మళ్లీ ఆంక్షలు

  • Published By: madhu ,Published On : June 11, 2020 / 05:53 AM IST
లాక్ డౌన్ సడలింపులు..వాటిపై మళ్లీ ఆంక్షలు

భారతదేశంలో కరోనా యమ స్పీడుగా వ్యాపిస్తోంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా బారిన పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..వైరస్ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. లాక్ సడలింపులు ఇవ్వడంతోనే కేసుల సంఖ్య పెరుగుతున్నాయని, ప్రజలు కూడా నిబంధనలు పాటించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ కరోనాతో వణికిపోతోంది. వందల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఎలాగైనా వైరస్ ను అరికట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. 2020, జూన్ 10వ తేదీ బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. కరోనా కేసుల గురించి ప్రధానంగా చర్చించారు. 

తాజాగా…లాక్ డౌన్ సడలింపులను మరోసారి సమీక్షించాలని నిర్ణయించింది ఆప్ ప్రభుత్వం. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లపై నిబంధనలు కొనసాగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల కట్టడికి ఆంక్షలు అవసరమని ఆప్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో త్వరలోనే లాక్ సడలింపులపై ఆంక్షలు విధించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. 

భారతదేశంలో గత 24 గంటల్లో 9 వేల 996 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 357 మంది చనిపోయారు. మొత్తంగా దేశంలో 2 లక్షల 86 వేల 579కి చేరాయి. 8 వేల 102 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లక్షా 37 వేల 448 యాక్టివ్ కేసులుండగా..లక్షా 41 వేల 029 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

మహారాష్ట్రలో అత్యధికంగా 94 వేల 041 కేసులు. 3 వేల 438 మంది మృతి.
తమిళనాడులో 36 వేల 841 కేసులు. 326 మంది మృతి. 
ఢిల్లీలో 3 వేల 810 కేసులు. 984 మంది మృతి.
గుజరాత్ లో 21 వేల 521 కేసులు. వేయి 347 మంది మృతి. 
ఉత్తర్ ప్రదేశ్ లో 11 వేల 610 కేసులు. 321 మంది మృతి.

రాజస్థాన్ లో 11 వేల 600 కేసులు. 259 మంది మృతి.
మధ్యప్రదేశ్ లో 10 వేల 049 కేసులు. 427 మంది మృతి.
వెస్ట్ బెంగాల్ లో 9 వేల 328 కేసులు. 432 మంది మృతి. 
కర్నాటకలో 6 వేల 041 కేసులు. 69 మంది మృతి.

దేశ రాజధానిలో మాత్రం వైరస్ ప్రమాదకరంగా మారుతోంది. రాబోయే రోజుల్లో కేసులు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం కేజ్రీవాల్ సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం ప్రజలు ఢిల్లీకి వస్తే..జూలై 31 నాటికి రాష్ట్రానికి 1.5 లక్షల పడకలు అవసరం అవుతాయన్నారు. 

Read: COVID-19కు వ్యాక్సిన్ తయారీకి Johnson & Johnson రెడీ