కేరళలో ఉమెన్స్ డే : మహిళాపోలీసులకే పోలీస్ స్టేషన్‌ (SHO) బాధ్యతలు

  • Published By: madhu ,Published On : March 8, 2020 / 05:23 AM IST
కేరళలో ఉమెన్స్ డే : మహిళాపోలీసులకే పోలీస్ స్టేషన్‌  (SHO) బాధ్యతలు

ఉమెన్స్ డే సందర్భంగా కేరళ సర్కార్ వినూత్న నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారిత చాటేందుకు..మహిళా పోలీసులకు బాధ్యతలు అప్పగించింది. మహిళా  ఎస్ఐలు లేకపోతే..సీనియర్ మహిళఆ పోలీసులు బాధ్యతలు చేపట్టాలని సూచించింది. సీఎం ఎస్కార్ట్‌గా మహిళా కమాండర్లను నియమించింది. మహిళా దినోత్సవం సందర్భంగా..పోలీస్ స్టేషన్ల నిర్వాహణ దగ్గరి నుంచి..రైళ్లు నడపడం వరకు అన్ని బాధ్యతలు మహిళలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్ర డీజీపీ లోక్ నాథ్ బెహరా..ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. 

పోలీస్ స్టేషన్లలో మహిళా ఎస్ఐలకు station house officers (SHO) బాధ్యతలు అప్పచెప్పాలని ఆదేశాల్లో వెల్లడించారు. ఈ రోజున ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను..కేసుల పరిష్కారం..తదితర విషయాలు..మహిళా పోలీసు అధికారులే చూసుకుంటారని డీజీపీ తెలిపారు. సీఎం వాహన ఎస్కార్ట్ బాధ్యతలు చూస్తున్న మగ కమాండర్లను స్థానంలో మహిళలను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇక రైళ్ల విషయానికి వస్తే..వేనాడ్ ఎక్స్ ప్రెస్ రైలుకు మహిళా లోకో పైలట్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ట్రైన్ పైలెట్లతో పాటు..పాయింట్స్ మన్, గేట్ కీపర్, ట్రాక్ సిబ్బంది అందరూ మహిళలే ఉంటారని కేరళ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. 

Read More : నాన్న (మారుతీరావు) ఎందుకు చనిపోయాడో తెలియదు – అమృత