Nipah virus : కేరళలో నిఫా వైరస్ సోకి 12 ఏళ్ల బాలుడు మృతి

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కోజికోడ్ లోని జిల్లా ఆస్పత్రిలో నిఫా వైరస్ సోకి చికిత్స పొందుతు 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో మరోసారి కేరళ ఉలిక్కిపడింది.

Nipah virus : కేరళలో నిఫా వైరస్ సోకి 12 ఏళ్ల బాలుడు మృతి

Nipah Virus In Kerala

Nipah virus dies In Kerala :కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కోజికోడ్ లోని జిల్లా ఆస్పత్రిలో ఈ వైరస్ సోకి చికిత్స పొందుతు 12 ఏళ్ల బాలుడు ఆదివారం (సెప్టెంబర్ 4,2021) ప్రాణాలు కోల్పోయిన ఘటనతో మరోసారి నిఫా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మూడేళ్ల కిందట తొలిసారిగా అంటే 2018లో నిఫా వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కరోనాతో పోరాడు మహమ్మరి నియంత్రణలో కఠిన చర్యలు తీసుకున్న కేరళలో మరోసారి నిఫా భయాందోళనలు కలిగిస్తోంది. నిఫా వైరస్ సోకిన 12 ఏళ్లు బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం ప్రకటించారు.

కోజికోడ్‌కు చెందిన బాలుడు రక్త నమూనాలను పుణేలోని నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించి పరీక్షించగా.. నిఫా పాజిటివ్‌ వచ్చిందని..వెల్లడించారు. రాష్ట్రంలో మరోసారి నిఫా కలకలం రేగడంతో జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం బృందాన్ని కేంద్ర ప్రభుత్వం హుటాహుటిన కేరళకు పంపింది.గత నాలుగు రోజుల క్రితం బాలుడు విపరీతమైన జ్వరంతో ఆస్పత్రిలో చేరిన బాలుడి రక్త నమూనాలను శుక్రవారం సేకరించాం.. ప్లాస్మా, సీఎస్ఎఫ్, సీరమ్‌లోనూ నిఫా గుర్తించారు.. శనివారం నుంచి బాలుడు ఆరోగ్యం విషమించిందని ఈక్రమంలో ఆదివారం బాలుడు మృతి చెందాడని తెలిపారు.

బాధితుడ్ని తొలుత చికిత్స కోసం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారని, తర్వాత మెడికల్ కాలేజీకి తరలించి.. అక్కడ నుంచి మళ్లీ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారని వివరించారు. కాబట్టి ఈ మూడు చోట్ల అతడితో కాంటాక్ట్ అయినవారిని గుర్తించామని కానీ వారిలో ఎటువంటి వైరస్ లక్షణాలు కనిపించలేదని తెలిపారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ఆరోగ్య శాఖ నిశితంగా గమనిస్తోందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముందస్తు జాగ్రత్తగా కోజికోడ్ జిల్లాతో పాటు పక్క రాష్ట్రాలన కన్నూర్, మలప్పురం అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. కాగా కేరళలో తొలిసారిగా 2018 మే 19న నిఫా వైరస్ కేసు కోజికోడ్‌లోనే బయటపడింది. ఇప్పుడు మళ్లీ అదే జిల్లాలో నిఫా మరణం నమోదు అయ్యింది. 2018లో నిఫా వైరస్ తో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.