Covid-19 : కేరళలో కరోనా కల్లోలం.. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 70 శాతం కేసులు ఇక్కడి నుంచే

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 70 శాతం కేసులు కేరళలోనే వెలుగుచూస్తున్నాయి.

Covid-19 : కేరళలో కరోనా కల్లోలం.. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 70 శాతం కేసులు ఇక్కడి నుంచే

Covid 19 (2)

Covid-19 : దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. 338 మంది మృతి చెందారు. తాజాగా నోమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలో వెలుగుచూసినవే ఉన్నాయి.

Read More : వైరస్ సోకిన 30 రోజుల్లో చనిపోతే కోవిడ్ మరణమే..కేంద్రం కొత్త మార్గదర్శకాలు

కేరళలో గడిచిన 24 గంటల్లో 20487 కేసులు నమోదయ్యాయి. దేశంలోని కేసుల్లో 70 శాతానికి పైగా కేసులు కేరళ నుంచే వస్తున్నాయి. మరణాలు కూడా 200లకు చేరువలో నమోదవుతున్నాయి. ఇక 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 34848 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు.

తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,32,36,921కి చేరింది. 4,42,655 మృతి చెందారు. కరోనాను జయించి 3,24,09,345 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 3,84,821 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Read More : Youngster Died : వినాయక మండపం వద్ద డ్యాన్స్‌ చేస్తూ యువకుడు మృతి

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 73,82,07,378 మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది.