త్రివేండ్రమ్ ఎయిర్ పోర్టు ప్రైవేటు..కేంద్రంపై కేరళ సర్కార్ సీరియస్

  • Published By: madhu ,Published On : August 22, 2020 / 07:18 AM IST
త్రివేండ్రమ్ ఎయిర్ పోర్టు ప్రైవేటు..కేంద్రంపై కేరళ సర్కార్ సీరియస్

త్రివేండ్రమ్ ఎయిర్ పోర్టు ను ప్రైవేటుకు అప్పగించడంపై కేరళ సర్కార్ సీరియస్ అయ్యింది. అభ్యంతరం వ్యక్తం చేసింది. సహకారం అందించలేమని నేరుగా ప్రధాన మంత్రికి లేఖ రాశారు కేరళ సీఎం పినరయి విజయన్.



దేశంలోని మూడు విమానాశ్రయాలను ప్రైవేటు (అదానీ) కు అప్పగిస్తూ..కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో కేరళ రాష్ట్రంలో త్రివేండ్రమ్ ఎయిర్ పోర్టు ఉంది. ఎయిర్ పోర్టును ప్రైవేటుకు అప్పగించే నిర్ణయంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని లేదా అని ప్రశ్నించారు.

ఇంటర్నేషనల్ టెర్మినల్ ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 23.57 ఎకరాల భూమిని ఎయిర్ పోర్ట్ అధారిటీకు ఉచితంగా అందించిందన్నారు. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని సీఎం పినరయి విజయన్ కోరారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రభుత్వం సహకరించదని తెలిపారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం మేజర్ భాగస్వామిగా ఉండేలా స్పెషల్ పర్పస్ వెహకల్ ఏర్పాటు చేయాలని పలుమార్లు కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.



తమ అధీనంలో ఉన్న ఎయిర్ పోర్టును ప్రైవేటు పరం చేయడంపై ‘రైట్ ఆఫ్ రిఫ్యూజల్’ హక్కున్న కేరళ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించింది. తమ ప్రభుత్వం ఎన్నిసార్లు కేంద్రానికి విన్నవించినా, తమ విజ్ఞాపనలను మోదీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని పినరయి సర్కారు ఆరోపణలు చేస్తోంది.