చర్చిలో IT రైడ్ : రూ.5 కోట్ల నగదు సీజ్..అక్రమంగా రూ.100కోట్ల నిధుల సేకరణ

  • Published By: nagamani ,Published On : November 7, 2020 / 05:09 PM IST
చర్చిలో IT రైడ్ : రూ.5 కోట్ల నగదు సీజ్..అక్రమంగా రూ.100కోట్ల నిధుల సేకరణ

Kerala Church IT ride Rs.5 crore seized : పరమ పవిత్రిమైన ఓ చర్చిపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. దీంతో చర్చిలో అక్రమ నిధులు బైటపడ్డాయి. కేరళలోని ఓ చర్చిలో కళ్లు తిరిగే డబ్బులు కట్టలు కట్టలుగా బయటపడ్డాయి.చర్చిలో ఏకంగా రూ. 5 కోట్లకుపైగా కరెన్సీ నోట్లు వెలుగులోకొచ్చాయి. ఈ చర్చి నిర్వాహకులు విదేశాల నుంచి 100 కోట్లకుపైగా అక్రమ నిధులు సేకరించినట్లు ఐటీ తనికీల్లో తేలింది.



కేరళలోని పత్తినంతిట్టలో ఉన్న ఎవాంజలిస్ట్ కేపీ యోహనన్స్ నిర్వహిస్తున్న బిలీవర్స్ చర్చి సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపుదాడులు చేశారు. విదేశాల నుంచి అక్రమ మార్గంలో భారీగా నిధులు సేకరిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో సోదాలు నిర్వహించారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ, విదేశీ విరాళాల నియంత్రణ చట్టాలను అడ్డగోలుగా ఉల్లంఘించి ఈ నిధులు సేకరిస్తున్నట్లు తెలిసింది.
https://10tv.in/up-energy-minister-shrikant-sharma-cycles-to-work-for-green-cause/


గత మూడు రోజులుగా జరిపిన దాడుల్లో చర్చి అక్రమాలు బయటపడ్డాయని ఐటీ అధికారులు తెలిపారు. బిలీవర్స్ చర్చిలో జరిగిన అక్రమాలు బైటపడటంతో రాష్ట్రంలోని ఇతర చర్చీల్లోనూ దాడులను నిర్వహిస్తున్నారు అధికారులు.


విదేశీ నిధులతో చర్చి సంస్థల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో కేంద్రం ఇప్పటికే ఎన్జీవోకు నిధులపై ఆంక్షలు విధించడం తెలిసిందే. ప్రముఖ హక్కుల సంస్థ ఆమ్నెస్టీపైనా కొరడా ఝళిపించింది. ఈ క్రమంలో చర్చీలు పెద్దసంఖ్యలో ఉన్న కేరళలో దాడులు మొదలయ్యాయి.


బిలీవర్స్ చర్చిపై ఇదివరకే ఆరోపణలు రావడంతో ఆ సంస్థ కింద పనిచేస్తున్న ఎన్జీవోలు విదేశీ నిధులు తీసుకోవద్దని కేంద్రం మూడేళ్ల కిందటే ఆదేశాలు జారీ చేసింది. దొంగపేర్లతో చర్చి యథావిధిగా విదేశా నిధులు పొందుతున్నట్లు తెలియడంతో సోదాలు నిర్వహించారు. గత మూడేళ్లతలో రూ.100 కోట్లు విదేశీ నిధులు అందాయని, పూర్తి వివరణాలను తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.