6.5 కిలోమీటర్ల కేక్..! : దక్షిణ భారతీయుల ప్రతిభకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్

  • Published By: veegamteam ,Published On : January 17, 2020 / 04:17 AM IST
6.5 కిలోమీటర్ల కేక్..! : దక్షిణ భారతీయుల ప్రతిభకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్

సంక్రాంతి పండుగ రోజున కేరళలోని త్రిస్సూర్ లోని చెఫ్ లు ప్రపంచ రికార్డును సృష్టించారు. దక్షిణ భారతదేశంలోని బేకర్స్ కలిసి బుధవారం (జనవరి 15) 6.5కిలో మీటర్ల కేకు ను తయారు చేసి ప్రపంచ రికార్డును సాధించారు. 605 కిలోమీటర్ల (4 మైళ్లు) పొడవైన కేకును తయారు చేయటానికి 1500లమంది చెఫ్ లు, బేకర్స్ నాలుగు గంటల సమయం కష్టపడి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించారు.
 
కేరళలోని త్రిస్సూర్ నగరంలోని మైదానం రోడ్ల పక్కన వేలాది టేబుల్స్ వేసి కేకును తయారు చేశారు.చాక్లెట్, వెనీలా వంటి పలు ఫ్లేవర్లతో తయారు చేసిన ఈ కేకు బరు 27 వేల కిలోలు (59 వేల 500ల పౌండ్లు). 6.5 కిలో మీటర్ల పొడవు ఉన్న ఈ కేకు నాలుగు అంగుళాల వెడల్పుతో తయారు చేసిన ఈ కేకులో 12 వేల కిలో చక్కెర, పిండిలను వినియోగించారు.  
 
ఈ అతిపెద్ద కేకును తయారు చేయటాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా..ఈ కేకుకు 6వేల 5 వందల పొడవును నిర్థారించటానికి గిన్నీస్ రికార్డు ఇవ్వటానికి నిర్వాహకులు పెండింగ్ లో ఉందనీ..గ్రూప్ సెక్రటరీ నౌషాద్ తెలిపారు. ఈ కేకు తయారీలో పరిశుభ్రతను పాటించామనీ…మా టాలెంట్ ను ప్రపంచానికి తెలపాలని ఈ ప్రయత్నం చేశామని తెలిపారు. 

కాగా.. జిక్సీ కౌంటీలోని చైనా కేక్స్ తయారీదారులు 2018లో 3.2 కిలో మీటర్ల పొడవైన ఫ్రూట్ కేక్ తయారు చేసి సాధించిన గిన్నీస్ రికార్డును కేరళలోని త్రిస్సూర్ లో తయారు చేసిన బేకర్స్ బ్రేక్ చేశారు.