కరోనా సమయంలో నిరాడంబరంగా కేరళ సీఎం కుమార్తె పెళ్లి

  • Published By: venkaiahnaidu ,Published On : June 15, 2020 / 04:14 PM IST
కరోనా సమయంలో నిరాడంబరంగా కేరళ సీఎం కుమార్తె పెళ్లి

కేరళ సీఎం పినరయి విజయన్​ కుమార్తె వీణ వివాహం సోమవారం జరిగింది. తిరువనంతపురంలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం క్లిఫ్ హౌస్​లో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో సీఎం అధికారిక నివాసంలో సాదాసీదాగా పెళ్లితంతు జరిపించారు. కరోనా నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగానే జరిగిన ఈ వివాహానికి పలువురు రాజకీయ నేతలు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. 

veena3.jpg

డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా(డీవైఎఫ్​ఐ) జాతీయ అధ్యక్షుడు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మహమ్మద్​ రియాజ్​​ను వీణ పరిణయమాడారు. విశ్రాంత ఎస్పీ పీ.ఎం అబ్దుల్ ఖాదర్ కుమారుడు రియాజ్​​. సీపీఎం అనుబంధ సంస్థ ఎస్​ఎఫ్​ఐ ద్వారా రియాజ్  రాజకీయ జీవితం ప్రారంభించారు. రియాజ్‌ 2009 ఎన్నికల్లో కోజికోడ్‌ లోక్‌సభా స్థానానికి పోటీచేసి, కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. 2017లో డీవైఎఫ్​ఐ జాతీయ అధ్యక్షుడిగా రియాజ్ బాధ్యతలు తీసుకున్నారు.

వీణ.. ఐటీ రంగంలో రాణిస్తున్నారు. ఒరాకిల్​లో కన్సల్టెంట్​గా, ఆర్పీ టెక్​సాఫ్ట్​ ఇంటర్నేషనల్ సీఈఓగా వ్యవహరించారు. ప్రస్తుతం బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఎక్సాలాజిక్​ సొల్యూషన్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​కు మేనేజింగ్ డైరెక్టర్​గా ఉన్నారు.

కాగా, ఇది వారిద్దరికీ ఇది రెండో వివాహం. రియాజ్‌ తన మొదటి భార్యతో, వీణ తన మొదటి భర్తతో విడాకులు తీసుకున్నారు. రియాజ్‌కు ఇద్దరు పిల్లలు, వీణకు ఒక కొడుకు ఉన్నారు.