Norovirus In Kerala : కేరళలో మరోసారి నోరోవైరస్ కేసులు.. ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

కేరళలో మరోసారి నోరో వైరస్ వెలుగులోకి వచ్చింది. కేరళలో రెండు నోరో వైరస్ కేసులు నమోదు అయ్యాయని ప్రభుత్వం నిర్ధారించింది.

Norovirus In Kerala :  కేరళలో మరోసారి నోరోవైరస్ కేసులు.. ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

Norovirus In Kerala

Norovirus In Kerala : కేరళను పలు వైరస్ లు హడలెత్తిస్తున్నాయి. భారత్ లో కోవిడ్ కేరళలోనే వెలుగులోకి వచ్చింది. బర్డ్ ఫ్లూ..టమాటో ఫ్లూ వంటి వైరస్ లు కేరళను వణికిస్తున్నాయి. ఈ క్రమంలో కేరళలో మరోసారి నోరో వైరస్ వెలుగులోకి వచ్చింది. కేరళలో రెండు నోరో వైరస్ కేసులు నమోదు అయ్యాయని ఆదివారం ( 5,22)ప్రభుత్వం నిర్ధారించింది.

రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని వళింజమ్ ప్రాంతంలో ఇద్దరు చిన్నారుల్లో నోరో వైరస్‌ను నిపుణులు గుర్తించారు. వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ బారినపడిన ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం నిలకడగానే ఉందని..నివారణ చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కలుషిత ఆహారం, అతిసార ఫిర్యాదుల క్రమంలో వళింజమ్‌లోని ఎల్‌ఎంఎస్ఎల్‌పీ పాఠశాల విద్యార్థుల నుంచి నమూనాలు సేకరించి, పరీక్షల కోసం పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌కు పంపామని తెలిపారు.

కాగా..నోరోవైరస్ నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఆరోగ్య శాఖ అవసరమైన నివారణ చర్యలు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. కేరళలో తొలిసారి గతేడాది నవంబరులో నోరోవైరస్ తొలి కేసు నమోదైంది. వయనాడులోని వెటర్నరీ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులు నోరోవైరస్ బారినపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంతో అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కేసులు నమోదు కాలేదు.

ఆహారం లేదంటే కలుషిత ద్రవాల ద్వారా నోరోవైరస్ వ్యాపిస్తుంది. వైరస్ ఉన్న ఉపరితలాలు, వస్తువులను తాకడం ద్వారా కానీ, అది సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండడం ద్వారా కానీ ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తులతో శారీరక సంబంధం, శ్వాస, విసర్జనల ద్వారా మిలియన్ల కొద్దీ నోరోవైరస్ కణాలు వ్యాపిస్తాయి. ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారినపడతారు. వైరస్ సోకిన వారిలో వికారం, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూడు రోజుల తర్వాత లక్షణాలు తగ్గిపోతాయి. అయితే, కోలుకున్న తర్వాత కూడా రెండు వారాలపాటు అతడి నుంచి వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది.

కాగా..నవంబర్ 2021లో కేరళలో మొట్టమొదట నోరోవైరస్ కేసులు నమోదయ్యాయి. వాయనాడ్‌లోని ఒక వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులు ఇన్‌ఫెక్షన్‌కు పాజిటివ్ పరీక్షించారు . ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి అదుపులోకి తెచ్చింది. ఆ తర్వాత మరింత వ్యాపించలేదు. ఆ తరువాత మరోసారి కేరళలో రెండు నోరో వైరస్ కేసులు నమోదు కావటం గమనించాల్సిన విషయం.

నోరోవైరస్ సోకిన వారికి వికారం, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతుంటారు. మూడు రోజుల తర్వాత లక్షణాలు తగ్గిపోతాయి, అయితే కోలుకున్న తర్వాత కూడా, సోకిన వ్యక్తి రెండు వారాల వరకు వైరస్‌ను వ్యాప్తి జరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.